Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అత్యంత వైభవంగా జరిగిన మడుగుతేరు

భక్తులతో పోటెత్తిన ధర్మవరం

వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు మజ్జిగ, పానకం పంపిణీ

విశాలాంధ్ర, ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు ఈనెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆలయ ఈవో వెంకటేశులు రథోత్సవ కమిటీ అధ్యక్షులు దాశెట్టి సుబ్రహ్మణ్యం, అర్చకులు కోనేరాచార్యులు మకరంద బాబు భాను ప్రకాష్ చక్రధర్, భక్తాదులు, ఉభయ దాతల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఏడవ రోజు ఉదయం మడుగుతేరు (రథోత్సవం) పురస్కరించుకొని ఆలయంలో అర్చకులు, బ్రాహ్మణ పురోహితులు నడుమ వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ మూలవిరాట్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గజవాహనముపై ఆశీనులు చేసి పట్టణ పురవీధుల ద్వారా తేరు బజారుకు చేరుకొని, రథోత్సవం పైకి ఆసీనులు చేశారు. మడుగుతేరుకు బండ్లపల్లి వంశస్థులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకు బ్రహ్మరథోత్సవములు భక్తాదుల నడుమ అర్చకులు నిర్వహించారు. ఉభయ దాతలుగా పెనుచూరి అశ్వత్త నారాయణ అండ్ సన్స్ వారు, రంగప్ప, సాయి రంగ, కృష్ణమూర్తి, డాక్టర్ సుమంత్, రమేష్, కార్తికేయ, బలరాం, రవితేజలు ఉభయ దాతలుగా వ్యవహరించారు. అనంతరం రాత్రి 7 గంటలకు దూలో ఉత్సవం (గజ వాహనం) నిర్వహించి పట్టణ పురవీధులలో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఉభయ దాతలుగా కలవల పెద్ద నారాయణ శెట్టి అండ్ సన్స్ ,రామసుబ్బయ్య అండ్ సన్స్, కలవల గోపాల శెట్టి అండ్ సన్స్, కె వి చలపతి అండ్ సన్స్, ముకుంద అండ్ సన్స్, దివాకర్ అండ్ సన్స్, ప్రకాష్ అండ్ సన్స్ వారు వ్యవహరించారు. చెన్నకేశవడి గోవింద నామ స్మరణతో ధర్మవరం పులకరించింది. రథోత్సవం కమనీయంగా సాగింది. రథోత్సవాన్ని తిలకించడానికి ఇతర జిల్లాల నుండి కూడా భక్తాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ రథోత్సవ కార్యక్రమం ఆలయ ఈవో వెంకటేశులు, రథోత్సవ కమిటీ అధ్యక్షులు దాశెట్టి సుబ్రహ్మణ్యం, సభ్యులు, ఉభయ దాతలు, భక్తాదులు, అర్చకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఈవో వెంకటేశ్వర్లు తదితరులు ఈ ఉత్సవానికి హాజరై రథాన్ని రాగి ప్రారంభించారు. పట్టణ ప్రముఖులు ఎమ్మెల్యేతో పాటు పూజలు నిర్వహించారు. ఈ రథోత్సవములో వేలాదిమంది భక్తాదులు పాల్గొని రథము వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, పట్టణ ప్రముఖులు తమదైన శైలిలో భక్తాదులకు మజ్జిగ, పానకము, చల్లటి నీళ్లు, చిత్రాన్నము, పాయసము అలాంటి వాటిని భక్తులకు పంపిణీ చేసి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. బ్రహ్మోత్సవ వ్రతాన్ని లాగడానికి మొదలుపెట్టగానే భక్తులంతా గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తాదులను అదుపు చేయడానికి పోలీసులు కూడా ఎంతో శ్రమపడి, విజయవంతం చేశా రు. డీఎస్పీ శ్రీనివాసులు, పట్టణ సిఐలు, ఇతర జిల్లాల నుండి వచ్చిన సిఐలు ఎస్సైలు, రాష్ట్ర, కేంద్ర పోలీస్ బలగాలు కూడా తమ భక్తి భావనమును చాటుకోవడంతోపాటు భక్తులకు సహాయ సహకారాలు కూడా అందించారు. అంతేకాకుండా ఈ రథోత్సవములో అన్నమయ్య సేవా మండలి అధ్యక్షుడు పోరాల పుల్లయ్య శిష్య బృందం కళాకారులు సింగాని మేళం, పంచమా వాయిద్యం బృంద నాట్యంతో భక్తులను తన్మయత్వం చేశారు. తదుపరి రథోత్సవంలో పాల్గొన్న సత్య కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయ్ కుమార్, కమతం కాటమయ్య తదితర రాజకీయ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని చెన్నకేశవ స్వామి కి అర్చకులు ద్వారా పూజలు చేయించారు. అదేవిధంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు కూడా చేయించారు. మొత్తం మీద గత సంవత్సరము కంటే ఈ సంవత్సరం భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొనడం పట్ల, రథోత్సవ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఆలయ ఈవో వెంకటేశులు, రథోత్సవ కమిటీ అధ్యక్షుడు దాశెట్టి సుబ్రమణ్యం, సభ్యులు పేరుపేరునా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img