Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం ఎన్నికల సన్నద్ధత, ఎలక్టోరల్ రోల్ సమస్యలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ గాయత్రీ దేవి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుది ఓటర్ల జాబితాలో డూప్లికేట్, డెత్ కేసులు, మోర్ దెన్ 10 ఎలక్టర్స్, తదితర వాటికి సంబంధించి కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులను నిత్యం మానిటర్ చేయడం జరుగుతోందని వివరించారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సెక్టోరియల్ అధికారులకు, ఏఎల్ఎంటిలకు శిక్షణ పూర్తి చేయడం జరిగిందని, రెండవ విడత శిక్షణ వచ్చే వారంలో నిర్వహిస్తామన్నారు. జిల్లాలో పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, అడిషనల్ పోలింగ్ సిబ్బందిని గుర్తించామన్నారు. జిల్లాలో 10 వరకు పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతుల కల్పన చేపట్టడం జరుగుతోందని, వారం రోజుల్లోపు పనులను పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోకి మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా సరిహద్దు చెక్ పోస్ట్ లను బలోపేతం చేశామన్నారు. ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులను నిత్యం మానిటర్ చేయాలన్నారు. అన్ని వివరాలు ఎప్పటికప్పుడు ఎన్నికల కమీషన్ కు పంపించాలన్నారు. ఎన్నికల కమీషన్ సూచనలు పాటించాలని, ఎన్నికల విధులపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఎన్నికల సన్నద్ధతపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలు, నోడల్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు.
అనంతరం ఈఆర్ఓలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. బిఎల్ఓలతో క్షేత్రస్థాయిలో ఇంటరాక్ట్ కావాలని, సంబంధిత ఏఈఆర్ఓలతో ఈఆర్ఓలు సమావేశం నిర్వహించాలన్నారు. క్లెయిమ్స్ లను ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పోలింగ్ స్టేషన్ వారిగా ఎలక్టోరల్ రోల్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేపట్టాలన్నారు. సాధారణ ఎన్నికల -2024 సన్నద్ధతపై అధికారులు వారికి కేటాయించిన విధులను సక్రమంగా, బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ఈఆర్ఓలు వారి పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ ను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని, మరమ్మత్తులు కూడా చేయించాలని, మండల స్థాయి టీంలు పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాల్సి ఉందో ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాలన్నారు. ప్రతి చోటా బోర్వెల్, ఫర్నిచర్, గేట్స్, విద్యుత్ సరఫరా, తదితర పనులు జరుగుతున్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు గ్రంధి వెంకటేష్, రాణి సుస్మిత, వి.శ్రీనివాసులు రెడ్డి, ఈఆర్ఓలు వెంకటేశ్వర్లు, కరుణకుమారి, వెంకటనారాయణమ్మ, వరప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్, డిఐఓ రవిశంకర్, ఎన్నికల సెల్ సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్, తహసీల్దార్లు, ఎన్నికల డిటిలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img