Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నూతన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని పోతుకుంట రోడ్డు సమీపానగల నూతన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను మంగళవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణమైన గదులను పూర్తిగా పరిశీలించారు. క్లీనింగ్, పెయింటింగు, కాంపౌండ్, తదితర వాటిని పరిశీలిస్తూ పెండింగ్లో ఉన్న పనులను వెనువెంటనే మరో పది రోజుల లోపల పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఎక్కడా ఎటువంటి పెండింగ్ పనులు లేకుండా పూర్తి దశలో అయ్యే విధంగా సూపర్డెంట్ కూడా ఆకస్మిక తనిఖీలు చేయాలని తెలిపారు. సంక్రాంతి పండుగ లోపు పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఆసుపత్రి 12 కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మాణం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ నూతన ఆసుపత్రి పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ మాట్లాడుతూ ఈ నూతన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ప్రసవాలు, గర్భిణీ స్త్రీలకు వైద్య చికిత్సలు, నవజాత శిశువుల సంరక్షణ తదితర వాటికి వైద్య చికిత్సలు నిరంతరంగా ఉంటాయని తెలిపారు. అవసరమైతేనే రెఫర్ చేస్తామని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని కూడా పాత ఆసుపత్రి, నూతన ఆసుపత్రులలో కూడా విధులు కొనసాగిస్తారని తెలిపారు. ప్రజలందరికీ అన్ని రకాలుగా వైద్య చికిత్సలను అందించి ఆరోగ్యాన్ని కాపాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ లక్ష్మీకాంతరెడ్డి, డి ఈ చెన్నారెడ్డి, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img