Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సాధారణ ఎన్నికలు – 2024 కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ (మానిటరింగ్) పకడ్బందీగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎన్.జి.ఆర్.ఎస్ / ఎన్.జి.ఎస్.పి (ఎన్ జి ఆర్ ఎస్ /ఎన్ జి ఎస్ పి ), సీవిజిల్, కంప్లైంట్ రిసెప్షన్ యూనిట్ మరియు 1950 కాల్ సెంటర్, ఫీల్డ్ మానిటరింగ్ యూనిట్ & ఎంసిసి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్, పర్మిషన్ & ఎన్ఫోర్స్మెంట్, కమర్షియల్ టాక్సెస్ – రోడ్డు ట్రాన్స్పోర్ట్, స్టాట్యూటరీ రిపోర్ట్ సెల్, ఐ.అండ్.పీఆర్, తదితర అంశాలకు సంబంధించి 22 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేయాలని, ఇందులో వెబ్ క్యాస్టింగ్, వీ.ఎస్.టీ, ఎస్.ఎస్.టీ టీమ్ లు కూడా కవర్ చేయాలన్నారు. వాహనాల అనుమతికి సంబంధించిన రిపోర్టులు అందించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల దగ్గర నుంచి రిపోర్టులను సకాలంలో తెప్పించుకోవాలన్నారు. నోడల్ అధికారుల ఫోన్ నెంబర్లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ నిత్యం కొనసాగించాలని, ఏవైనా సమస్యలు ఉండే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
అనంతరం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎం.సి.ఎం.సి సెల్ నుంచి ఎలాంటి అడ్వర్స్ న్యూస్ వచ్చినా ఎప్పటికప్పుడు రిపోర్టులు అందించాలన్నారు. సోషల్ మీడియా నుంచి వస్తున్న అడ్వర్స్ న్యూస్ కి సంబంధించిన రిపోర్టులు కూడా అందజేయాలన్నారు. ఎం.సి.ఎం.సి సెల్ నుంచి 24 గంటల పాటు నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, నోడల్ అధికారులు వరప్రసాద్, ఉమామహేశ్వరమ్మ, వీర్రాజు, ప్రభాకర్ రెడ్డి, భాస్కర్, శ్రీనివాస నాయక్, అప్పాజీ, ఎంసిఎంసి మెంబర్ సెక్రటరీ పి.గురుస్వామి శెట్టి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img