విశాలాంధ్ర -బొమ్మనహల్ : మండలంలోని శ్రీధరగట్ట, బోల్లనగుడ్డం, గ్రామాల్లో ఇద్దరు వార్డు సభ్యులు ఇటీవల మృతి చెందడంతో వార్డు సభ్యులు ఎన్నిక కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా బుధు,గురువారాలు రెండు రోజులు పాటు నామినేషన్ల స్వీకరణ జరిగింది. రెండు గ్రామాల నుండి రెండే నామినేషన్లు దాఖలు అయినట్లు పిఓపిఆర్డి విజయమ్మ తెలిపారు. శ్రీధరఘట్ట గ్రామంలోని మూడో వార్డు స్థాననికి కురుబ హనుమశీతప్ప, బోల్లనగుడ్డం గ్రామంలోని మూడో వార్డు స్థానానికి హవళగి వెంకటేశులు నామినేషన్ దాఖలు అయినట్లు తెలిపారు. మరో ఎవరు పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవంగా తీర్మానించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాదిలింగ, మల్లికార్జున, నాగేంద్ర, వన్నూరుస్వామి, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.