Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పంచాయతీ రాజ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

విశాలాంధ్ర – ధర్మవరం-:: మండల పరిధిలోని పలు గ్రామాలలో పంచాయతీ రాజ్ కమిషనర్ సూర్యకుమారి -ఐఏఎస్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు బుడ్డారెడ్డిపల్లి కేశవరెడ్డి పొలం నందు అమృత్ సరోవర్ పనులను పరిశీలించారు. అనంతరం నేలకోట గ్రామములో సోలార్ ఇన్వర్టర్ పనులను తాగునీటి తొట్టిలను సిమెంట్ బెంచీల పనులను పరిశీలించి అక్కడ జరుగుతున్న వంటి ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి నేలకోట తండాలో ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ వ్యవసాయ పరికరాల ప్రదర్శనను వారు తిలకించారు. అనంతరం రైతులతో నేరుగా సమావేశంలో మాట్లాడుతూ వారికి గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు విన్న సూర్యకుమారి ప్రభుత్వముతో సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలు దేశానికి వెన్నెముక లాంటివని, రైతుల గ్రామాల ప్రజలు సమస్యలను పరిష్కరించుటలో ప్రతి విభాగపు అధికారి తమ విధులను చక్కగా నిర్వర్తించే విధంగా కృషి చేయాలని వారు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వాటర్ షెడ్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, జాయింట్ కమిషనర్ శశిధర్ రెడ్డి, శివప్రసాద్, డ్రామా పీడీ రామాంజనేయులు, జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, ఆర్డిఓ తిప్పే నాయక్, ఎంపీడీవో సౌజన్యకుమారి, ఎమ్మార్వో యుగేశ్వరి దేవి, వాటర్ షెడ్ సిబ్బంది భాస్కర్,అశోక్, రవీంద్రారెడ్డి, జిల్లా టీం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img