Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

విధులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఎన్నికల కమీషన్ ఇచ్చిన నిబంధనలు ప్రతి ఒక్కటి తప్పనిసరిగా పాటించాలి : జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడం కోసం నోడల్ అధికారులు, ఏఎల్ఎంటీలు వారికి కేటాయించిన విధులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు.
మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నోడల్ అధికారులు, ఏఎల్ఎంటీలకు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ శిక్షణలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. ఎన్నికల కమీషన్ ఇచ్చిన నిబంధనలు ఎలాంటి మిస్ కాకుండా ప్రతి ఒక్కటి తప్పనిసరిగా పాటించాలన్నారు. అధికారులు ఎన్నికల్లో నిత్యం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏఎల్ఎంటీలు పిఓ బుక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదివాలని, ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకోవాలన్నారు. ప్రతి అంశంపై అవగాహన ఉండటం వల్ల ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపించవచ్చో తెలుస్తుందన్నారు. పీఓ బుక్ చదవడం ద్వారా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుందని, ఎన్నికల్లో శిక్షణ అనేది అత్యంత కీలకమన్నారు. అధికారులు ఎలాంటి రాజీ లేకుండా పని చేయాలని, మల్టిపుల్ రౌండ్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్నికలపై శిక్షణా కార్యక్రమాలు వెన్నెముక లాంటివని, ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించేందుకు అధికారులు అంతా ఒక టీంగా పని చేయాలన్నారు.
మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ కు సంబంధించి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మొత్తం సిబ్బందిని గుర్తించాలన్నారు. అధికారుల లభ్యత, వారి వివరాలను తీసుకోవడం, డేటాను విశ్లేషించడం, సకాలంలో వారిని నియమించడం చేయాలన్నారు. ఈవీఎంలను సరైనరీతిలో భద్రపరచాలని, ఈవీఎంల రాండమైజేషన్, ఫంక్షనింగ్ ఎంతో ముఖ్యమన్నారు. ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఎన్నికలలో ఉపయోగించాల్సిన అన్ని రకాల రవాణా అవసరాలకు అనుగుణంగా వాహనాలను గుర్తించాలన్నారు. బస్సులు, మినీ వాహనాలు ఎన్ని అవసరమవుతాయి అనేది ముందుగానే సరి చూసుకోవాలని, సంబంధిత ఆర్వోలతో మాట్లాడి పూర్తి వివరాలు సిద్ధం చేయాలన్నారు. అనంతపురం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలని, ఈ విషయమై సంబంధిత ఆర్వో, డిఎస్పిలతో రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చేయాలని ఆర్అండ్బి ఎస్ఈని ఆదేశించారు. ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులందరి సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు శిక్షణ కార్యక్రమాల కోసం ట్రైనింగ్ షెడ్యూల్ సిద్ధం చేయాలని, ఏ రోజు ఎవరికీ శిక్షణ ఇవ్వాలి అనేది ముందుగానే షెడ్యూల్ చేయాలని ఆదేశించారు. ఏరోజు ఎవరికీ శిక్షణ ఇవ్వాలి అనేది ఎన్నికల కమిషన్ తేదీలను ఇవ్వడం జరిగిందని, దానికి అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలన్నారు. మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించి జిల్లా స్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్‌లను ఏదీ మిస్ కాకుండా సేకరించాలని, సంబంధిత అధికారులకు మెటీరియల్ పంపిణీకి తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలును పకడ్బందీగా చేయాలన్నారు. ఎన్నికలవేళ హెల్ప్ లైన్ మరియు కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఫిర్యాదులు ఏవి వస్తున్నాయి, వాటిని ఎవరికి పంపించాలి, ఫిర్యాదులకు ఎలాంటి రిపోర్టు అందించారు అనేది చూసుకుని ఎన్నికల కమీషన్ కు అన్ని వివరాలు పంపించాలన్నారు. బ్యాలెట్ పేపర్ ముద్రణకు సంబంధించి ప్రింటర్స్ గుర్తించడం చేయాలన్నారు. అధికారులు వారికి ఇచ్చిన విధులు ఏంటి అనేదానిపై శ్రద్ధ పెట్టాలని, ఎన్నికల్లో సమయం అనేది చాలా ముఖ్యమని, అలాంటి చోట విధులు కేటాయించడం అంటే అత్యంత కీలకంగా భావించాలన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ నీలమయ్య, డీఆర్డీఏ పిడి నరసింహారెడ్డి, డీపీఓ ప్రభాకర్ రావు, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, డిటిసి వీర్రాజు, ఎల్డిఎం సత్యరాజ్, మార్కెటింగ్ ఎడి చౌదరి, ఆర్అండ్బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, బిసి వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిఐఓ రవిశంకర్, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రవీంద్ర, ఎన్నికల సెల్ డిటి రాజా, సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్, నోడల్ అధికారులు, ఏఎల్ఎంటీలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img