Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు

: జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణకు శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం కృషి ఎనలేనిదన్నారు. 1901 మార్చి 16న మద్రాసు జార్జి టౌన్ అణ్ణపిలై వీధిలో పొట్టి శ్రీరాములు జన్మించారని, ఆనాడు మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతం పట్ల ప్రదర్శిస్తున్న తీరును గమనించి మద్రాసు నగరంపై ఆంధ్రుల హక్కు ఉందని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ద్వారానే ఆంధ్ర జాతికి న్యాయం జరుగుతుందని భావించి 1952 అక్టోబర్ 19న తేదీన మద్రాసులోని మైలాపూరులో నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు. చివరకు 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యారని, అంతేగాక స్వాతంత్ర ఉద్యమంలో కూడా శ్రీ పొట్టి శ్రీరాములు గాంధీ మార్గంలో నడిచి అనేక ఉద్యమాలలో ప్రముఖపాత్ర వహించి స్వాతంత్ర్య సమరయోధునిగా గుర్తింపబడ్డారని తెలిపారు. వీరి జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన ముఖ్య కారకులు అయ్యారని తెలిపారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు తన జీవితాంతం కృషిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, బిసి సంక్షేమ శాఖ డిడి ఖుష్బూ కొఠారి, ఎస్డీసి ఆనంద్, హ్యాండ్లూమ్స్ అభివృద్ధి అధికారి బసవరాజు, కలెక్టరేట్, బిసి సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img