Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సైకియాట్రీ గోల్డ్ మెడల్ సంపాదించుకున్న జయసాయి

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ శ్రీదేవి
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ శ్రీదేవి గారి అనుమతి తో మానసిక వైద్యశాస్త్ర విభాగం ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ వైద్యనాథ్ పర్యవేక్షణలో అదే విభాగంలో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ తండ్రి పేరు మీద ఇవ్వనున్న డాక్టర్ రామకృష్ణ చౌదరి స్మారక సైకియాట్రి గోల్డ్ మెడల్ అవార్డ్ కొరకు పరీక్ష నిర్వహించగా వైద్య కళాశాలలో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఎంబిబిఎస్ చదువుతున్న కె. జయసాయి గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య శ్రీదేవి, తన ఛాంబర్ లో జయసాయి కి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి గారు మాట్లాడుతూ ఆంధ్ర వైద్య కళాశాల విశాఖ పట్టణం తర్వాత సైకియాట్రిలో గోల్డ్ మెడల్ ను అందిస్తున్న రెండవ కళాశాలగా అనంతపురం కు గుర్తింపు వచ్చింది మరియు జూనియర్ వైద్య విద్యార్థులకు మానసిక వైద్యం పైన అవగాహన కల్పించేందుకు ఎంతో కృషి చేసిన సెకియాట్రి హెచ్ ఓ డి డాక్టర్ వైద్యనాధ్ ను, డాక్టర్ అనిల్ కుమార్ ను , ఇతర సైకియాట్రి డాక్టర్లను అభినందిస్తున్నానని, గోల్డ్ మెడల్ ను సాధించిన జయసాయి స్ఫూర్తిగా తీసుకొని జూనియర్ విద్యార్థులు మరింత బాగా చదివి మానసిక శాస్త్ర వైద్య జ్ఞానాన్ని మానసిక రుగ్మతలను రూపుమాపడానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులను అకడమిక్స్ లో అత్యద్భుతంగా రాణించేలా అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న మా వైద్య ఉపాధ్యాయులను ఎంతగానో అభినందిస్తున్నానని ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ వైద్యనాత్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రమణ్యం,అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శారద, అనిల్ కుమార్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వరదరాజులు, రవి కుమార్, డి అడిక్షన్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img