Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఫారంఫండ్, అమృత్ సరోవర్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి

తాగునీటి పథకాల పునరుద్ధరణ పనులు చేపట్టి నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి
: టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఉపాధి హామీ పథకం కింద ఫారంఫండ్, అమృత్ సరోవర్ పనులను చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుంచి ఉపాధి హామీ పథకం పనులు, తాగునీటి సరఫరాపై ఉపాధి హామీ ఏపీఓలు, ఏపీడిలు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, డిఈలు, ఏఈలతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద ప్రతివారం ప్రతి మండలంలో 5 ఫారంఫండ్లు, 5 అమృత్ సరోవర్ పనులను మొదలు పెట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో కూలీల సంఖ్య మరింత పెరగాలన్నారు. ప్రతి మండలంలోనూ 5 వేల మందికి తక్కువ కాకుండా కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని ఆదేశించారు. కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా ఉపాధి పనులపై కూలీలకు అవగాహన కల్పించి పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాభావ, వేసవి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అన్ని తాగునీటి పథకాలను, చేతిపంపులను, ఓఅండ్ఎం పథకాలు పనిచేసేలా చూడాలని, అన్ని పథకాలను 2,3 రోజుల్లోపు పునరుద్ధరణ పనులు చేపట్టి నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ఉరవకొండ, విడపనకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో నీటి నిల్వ తగ్గిందని, ఆయా ప్రాంతాల్లో అదనపు బోర్లను వేయడం జరిగిందని, వాటికి కనెక్షన్లు ఇచ్చి నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు సంబంధించి రోజు వారిగా రిపోర్టులను అందజేయాలన్నారు. జిల్లాలో 10 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతోందని, ఆయా గ్రామాల్లో తాగునీటి పథకాలు పనిచేసేలా నిత్యం మానిటర్ చేయాలన్నారు. జిల్లాలో- తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, ఉపాధి హామీ ఏపీఓలు, ఏపీడిలు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img