Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ

విశాలాంధ్ర అనంతపురం వైద్యం ఆఫ్రికా దేశాలలో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆఫ్రికా మలేరియా డే గా జరుపుకునేవారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మలేరియా దినోత్సవాన్ని ఆఫ్రికా దేశాలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 2007లో కౌన్సిల్ సమావేశాన్ని నిర్ణయించింది. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవం పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వి. సుజాత, జిల్లా మలేరియా అధికారి డి. ఓబులు బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో భారత్ ప్రభుత్వం, మలేరియా వ్యాధిని 2016 సంవత్సరం నాటి నుండి 2027 నాటికి డెంగ్యూ వ్యాధి పూర్తిగా నిర్మూలించడం, 2030 నాటికి అంచలంచలుగా పూర్తిగా అంతం చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. మలేరియా సోకకుండా ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ఏఎన్ఎం హెల్త్ ఆప్ అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ మలేరియా వ్యాధిని సమూలంగా అంతం అందించడానికి ప్రభుత్వ, ప్రవేట్ ఎన్జీవో శాఖల సహాయ సహకారాలతో వ్యాధి నిరోధక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సహాయ మలేరియా అధికారి కే సత్యనారాయణ, మలేరియా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img