Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విజయవాడ వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం

విశాలాంధ్ర – ధర్మవరం : విజయవాడ వ్యాపారస్తులు అవినాష్ గుప్తా, నాగేశ్వరరావు చేతిలో దాడికి గురైన ధర్మవరం వస్త్ర వ్యాపారస్తులైన కోటం ఆనంద్, గిర్రాజు శశిధర్ లకు అండదండగా తాము ఉంటామని, భయపడాల్సిన పని లేదని దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బడి గింజల విజయలక్ష్మి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగింజల చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న లేపాక్షి ఎంపోరియం లో వీరికి కౌంటర్లను ఏర్పాటు చేసి, చేనేతను నేసిన చీరలను విక్రయిస్తామని వారు హామీ ఇచ్చారు. ధర్మవరం వ్యాపారస్తులు నమ్మకం పై విజయవాడ వ్యాపారస్తులకు చీరలు ఇచ్చి, అప్పులు అడిగితే దాడి చేయడం ఇది పద్ధతి కాదని వారు ఈ ఘటన ను తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సంఘటన అత్యంత హేయమైన చర్యగా వారు తెలిపారు. యావత్ చేతి వృత్తి ల కళాకారులు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితులను కూడా అరెస్టు చేయడం జరిగిందని, పలు కేసులను కూడా నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చూపిన చొరవకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ధర్మారం వ్యాపారస్తులు ఎవరు కూడా అధైర్య పడవలసిన అవసరం లేదని ఈ ప్రభుత్వం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ సెంట్రల్ గవర్నర్ కమిటీ మెంబర్ గిర్రాజు నగేష్, పుట్లూరు రామకృష్ణ, తొగట వీర క్షత్రియ సంఘం రాష్ట్ర నాయకులు ఎం. చంద్రప్ప, ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఆంధ్ర రీజియన్ పుష్పుండ మహర్షి గురువు, గురు పీఠం చేనేత నాయకులు ఏపీ హెచ్ డి సి. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ రామకృష్ణ, అనంతపూర్ లేపాక్షి ఎంపోరియం మేనేజర్ శ్రీనివాసులు, సిబ్బంది సురేష్, కాటమయ్య, తోలుబొమ్మల హస్త కళాకారుల కళాకారులు రామదాసు, పలువురు చేనేతలు, హస్త కళాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img