Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మున్సిపల్ ఉద్యోగులకు, కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి… సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల కొండారెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మున్సిపల్ ఉద్యోగులకు, కార్మికులకు పాదయాత్రలో, అసెంబ్లీలోనూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని, అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల కొండారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రెండవ రోజు స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్షల కార్యక్రమానికి ఓబుల కొండారెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లాల శ్రామిక మహిళా కన్వీనర్ దిల్షాద్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు, సిఐటియు మండల కార్యదర్శి ఆయుబ్ ఖాన్ ముఖ్యఅతిథిలుగా విచ్చేశారు. అనంతరం ఓబుల కొండారెడ్డి, దిల్షాద్ లు వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు, పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అమలు చేయలేదని, అదేవిధంగా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి ఇస్తానన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అందరినీ ఆరు నెలల్లో పర్మినెంట్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.మున్సిపాలిటీల్లో దళారి వ్యవస్థ రద్దు చేస్తామని, మున్సిపల్ కార్మికులకు చేసే పనులకు నెలకు లక్ష రూపాయలు జీతం ఇచ్చిన తక్కువే నాని తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. మాట తప్పని మడమ తిప్పని వంశం మాదిఅని మోసపు మాటలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క అవకాశం ఇమ్మని జగన్మోహన్ రెడ్డి చెప్పి, దానిని నమ్మి ఓట్లేసి గెలిపించిన కార్మికుల్ని నట్టేట ముంచారనీ మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడిచిన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని, ఉద్యోగులకు నాలుగు శాతం జీతాల కోతతో రివర్స్ పి ఆర్ సి ఇవ్వడం ఏంటి? అని వారు ప్రశ్నించారు. సిపిఎస్ రద్దు నీటి మూట అయ్యింది అని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పర్మినెంట్ విషయం అటకెక్కిందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులను ఆప్కాస్ లో చేర్చి, శాశ్వత బానిసలను చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థ ద్వారా క్లాప్ డ్రైవర్లను నియమించి, కనీసవేతనం కూడా ఇవ్వలేకపోవడం విడ్డూరమన్నారు. మున్సిపల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి, రెండు వేల మంది స్వీపర్లను ఇండ్లకు పంపించి, మొత్తంగా జగనన్న ప్రభుత్వం అందరికీ షటగోపం పెట్టింది అని తెలిపారు. పైగా నూరు శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం మాదిఅని వేదాలు వల్లించడం సిగ్గుచేటు అన్నారు. ఆ వంద శాతంలో మున్సిపల్ కార్మికులు ఉన్నట్ల లేనట్లా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కాబట్టి మున్సిపల్ కార్మికులను ఆప్కాసునుండి తొలగించి,
01 0 పద్ధతి ప్రకారం జీతాలు అమలు చేయాలనీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, కోవిడ్ లో తీసుకొన్న కార్మికులకు మిగతా కార్మికులతో పాటు సమాన వేతనం ఇవ్వాలనీ, క్లాప్ ఆటో డ్రైవర్లకు జీవో నెం.7 ప్రకారం రూ.18500/- అమలు చేయాలనీ, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలను,. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ ,ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
పట్టణ సిఐటియు అధ్యక్షులు ఎల్ ఆదినారాయణ. డివైఎఫ్ఐ. బాలాజీ. షేక్షావలి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు. బాబు, చెన్నకేశవులు, గౌరవ అధ్యక్షులు. పుల్లన్న, .ప్రసాద్,పెద్దక్క, నరసమ్మ, వెంకటేష్, పెద్దక్క,
నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img