Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ఓటు వేసిన సిపిఐ అనంత అభ్యర్థి జాఫర్

ఎన్నికల కేంద్రాల్లో విస్తృత పర్యటించిన సిపిఐ అభ్యర్థి…

ఓటర్లను ఒత్తిడికి గురి చేస్తున్న వైకాపా అభ్యర్థి….

ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం….

సిపిఐ అనంత అర్బన్ అభ్యర్థి సీ జాఫర్

విశాలాంధ్ర అనంతపురం ఇండియా కుట్టు సిపిఐ అనంతపురం అర్బన్ అభ్యర్థి సి జాఫర్ తమ కుటుంబ సభ్యులతో ఉదయాన్నే స్థానిక గుత్తి రోడ్డులో ఉన్న కల్పనా జోషి కాలనీలో సోమవారం లక్ష్మీ సినర్జీ పాఠశాలలో తమ ఓటును వినియోగించుకున్నారు. అనంతరం పలు ఎన్నికల కేంద్రాల్లో పర్యటించి అక్కడ ఉన్న పోలింగ్ కేంద్రంలో ఎంపీ,ఎమ్మెల్యే ఇంగ్లీషులో వ్రాయాల్సి ఉండాలని తద్వారా ఓటర్ల అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. వారి దృష్టికి తీసుకొని వచ్చి అప్పటికప్పుడు ఇంగ్లీష్ లో ఎంపీ ఎమ్మెల్యే అని రాయడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ… ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ కొన్ని కేంద్రాలలో పైకప్పు అభ్యర్థులు, జడ్పీ అభ్యర్థులు తమ తమ నాయకులతోటి కార్యకర్తలతోటి పోలింగ్ బూతులకు వచ్చి బహిరంగంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పడం చూస్తుంటే ఒక విధంగా హోటళ్లను ఒత్తిడికి గురి చేస్తున్నట్లు అనిపించింది అన్నారు. ఎన్నికల కేంద్రాల్లో నిర్వహిస్తున్న అధికారులు, పోలీస్ యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. వారితో పాటు మైనారిటీ సిపిఐ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img