ఆంధ్రప్రదేశ్లో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. అల్పపీడనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడిరచింది.పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15వ తేదీ లోపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రభావంతో ఈ నెల 17వ తేదీ వరకు ఉత్తర కోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడిరచారు.