విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం
కృష్ణా జిల్లాతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వాన పడిరది. విజయవాడలో సుమారు మూడు గంటలపాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, పెనమలూరు తదితర ప్రాంతాలలో భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రధాన రహదారులు చెరువులని తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.