Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముగిసిన ఏపీ ఈఏపీసెట్‌

ఇంజినీరింగ్‌లో 94.22 శాతం హాజరు
అగ్రికల్చర్‌, ఫార్మశీ`91.12 శాతం
నేడు ఇంజినీరింగ్‌ కీ విడుదల

విశాలాంధ్రబ్యూరో-అమరావతి: జేఎన్టీయూకాకినాడ అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మశీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపిసెట్‌)-2024 పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు గురువారం వరకు కొనసాగాయి. ఏపీలోని అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీ ఈఏపీసెట్‌2024కు ఇంజినీరింగ్‌ విభాగంలో అన్ని సెషన్లకు కలిపి మొత్తంగా 2,74,213 మంది విద్యార్థులకు గాను 2,58,373 మంది పరీక్షకు హాజరయ్యారు. 15840 మంది గైర్హాజరయ్యారు. 94.22 శాతం హాజరు నమోదైంది. అగ్రికల్చర్‌, ఫార్మశీ విభాగంలో అన్ని సెషన్లకు 88,638 మంది విద్యార్థులకు గాను 80,766 మంది పరీక్ష రాయగా… మరో 7872మంది గైర్హాజరయ్యారు. 91.12శాతం హాజరు నమోదైంది. అన్ని విభాగాలు కలిపి 3,62,851 మంది విద్యార్థులకు గాను 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. 23712 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరు కాలేదు. హాజరు శాతం 93.47 నమోదైంది. ఏపీ ఈఏపీసెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూ`కాకినాడ ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.
వెబ్‌సైట్‌లో అగ్రికల్చర్‌, ఫార్మశీ కీ: కన్వీనర్‌ వెంకటరెడ్డి
గతేడాది కంటే..ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్షకు అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు పరీక్షలో హాజరు శాతం కూడా గణనీయంగా పెరిగిందని ఏపీ ఈఏపీసెట్‌ 2024 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.వెంకటరెడ్డి తెలిపారు. అగ్రికల్చర్‌, ఫార్మశీ విభాగానికి సంబంధించి ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయడంతో పాటు రెస్పాన్స్‌ షీట్లను వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు. ఈనెల 25వ తేదీ ఉదయం 10గంటల వరకు ప్రాథమిక ‘కీ’పై విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక కీను విడుదల చేస్తామని, దీంతో పాటు రెస్పాన్స్‌ షీట్లను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వివరించారు. ఈనెల 26వ తేదీ ఉదయం 10గంటల వరకు ప్రాథమిక కీపై విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. ఏపీ ఈఏపీసెట్‌-2024 ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులకు, యూనివర్సిటీ అధికారులకు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లర్లు, ఏపీ ఆన్‌లైన్‌ సిబ్బందికి ఏపీ ఈఏపీసెట్‌ చైర్మన్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు ధన్యవాదాలు తెలిపారు.
వెబ్‌సైట్‌లో ఇంటర్‌ మార్కులు నమోదు చేసుకోవాలి: కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.వెంకటరెడ్డి
ఏపీ ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి 25వెయిటేజీ మార్కులను ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా తీసుకోనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రెగ్యులర్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్థులతోపాటు ఇతర బోర్డులకు చెందిన 10G2 విద్యార్థులు తమ మార్కులను ఏపీ ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలని,తద్వారా వారికి ర్యాంకులు కేటాయిస్తామని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.వెంకటరెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ,0884-2359599, 0884-2342499 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img