Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కురుపాంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తా


జిల్లాలో త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభం చేస్తా
గుమ్మిడిగెడ్డకు ఆమోదం
అమ్మ ఒడి ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ వెల్లడి
విశాలాంధ్ర,కురుపాం/పార్వతీపురం: కురుపాంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని,త్వరలోనే ఉత్తరాంధ్రలో విజయనగరం, నర్సీపట్టణం, పాడేరులలో కూడా మెడికల్ కాలేజీలలో తరగతులు ప్రారంభం చేయడంజరుగుతుందని, నెలరోజుల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కూడా ప్రారంభం చేస్తానని, కురుపాం నియోజక వర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గుమ్మిడి గెడ్డకు 55కోట్లరూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.బుదవారం మన్యంజిల్లాలోని కురుపాం నియోజకవర్గంలోని కురుపాంలో
అమ్మఒడి నాలుగో విడత కార్యక్రమాన్ని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన సమావేశం జరిగింది.సీఎం జగన్ మోహన్ రెడ్డి కురుపాంలో నాలుగో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని డిబిటి ద్వారా బటన్ నొక్కి ప్రారంభం చేశారు.42లక్షల 61వేల 965 మంది తల్లుల ఖాతాల్లో 6392 కోట్ల రూపాయలను డిబిటి ద్వారా కుల మతాలకు అతీతంగా, లంచంలేకుండా అన్ని వర్గాల తల్లులకు నేరుగా జమచేయటం జరిగిందన్నారు.ఇంతరవరకు నాలుగేళ్లలో మీమేనమామ జగన్ గడచిన నాలుగేళ్లలో 26వేల 67కోట్ల రూపాయలను డిబిటి ద్వారా ఒక్క బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. ప్రతీ పేద విద్యార్థి సత్య నాదెళ్ల తరహాలో తయారు కావాలన్నదే తనధ్యేయమని తెలిపారు. గిరిజనులకు తాను ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేస్తూ తనమంత్రి వర్గంలో ఐదు డిప్యూటీ సిఎంలను ఏర్పాటుచేయగా మొదటి ఉప ముఖ్యమంత్రి చెల్లెమ్మ పుష్పా శ్రీవాణికి డిప్యూటీ సీఎం ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు.ఇప్పటి రాష్ట్ర హోంశాఖ మంత్రి హరిజన మహిళని తెలిపారు. నలుగురు ఉపముఖ్యమంత్రులను ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు కేటాయించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నామినేటెడ్ పదవులను, కాంట్రాక్టులలో 50శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటాయిస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసిందన్నారు.ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ప్రతిపాదించిన గరుగుబిల్లి మండలంలో 10గ్రామాలకు జంఝావతి 21ఎల్ ద్వారా సాగునీరు అందించే లిఫ్టు ఇరిగేషన్ ఛానల్ కు,కురుపాంమండలంలోని జీడిపిక్కల పరిశ్రమ ఏర్పాటుకి ఆమోదం ప్రకటించారు. ఎల్లో మీడియా, దుష్టచతుష్టయం తాను 4ఏళ్లలో చేసిన అభివృద్థి పనులను, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక నిరంతరం ప్రభుత్వంపై బురద చల్లుకుంటూ ఉంటున్నారని
ఎద్దేవాచేశారు.టీడీపిపైనా, దత్తపుత్రుడు తీరుపై మండి పడ్డారు.ఎన్నికలప్పుడు కలిసికట్టుగా మ్యానిపెస్టోలను కలిసి కట్టుగా విడుదలచేసి, ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో పడేయడం వారికి అలవాటని తెలిపారు.ముఖ్యమంత్రికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పాశ్రీవాణి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షత్ రాజు పార్లమెంటు సభ్యులు జి. మాధవి, బెల్లాన చంద్ర శేఖర్ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, రాష్ట్ర పాటశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డిఐజి ఎస్ హరికృష్ణ, జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు,పాలకొండ సబ్ కలక్టర్ నూరుల్ కమర్, ఐటీడీఏ పీఓలు విష్ణు చరణ్, కల్పనకుమారి, శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్, శాసనసభ్యులు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, కంబాలజోగులు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, బడుకొండ అప్పల నాయుడు, జిసిసి ఛైర్మన్ స్వాతిరాణి, డిప్యూటీ మేయర్ కె. శ్రావణి, మాజీ పార్లమెంటు సభ్యులు, డివిజి శంకరరావు, పాలవలస రాజశేఖర్, శోభాహైమావతి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ జయమణి, టిడ్కో ఛైర్మన్ తదితర జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. జిల్లా ఆవిర్భావం, జిల్లా ప్రాధాన్యతను జిల్లా కలెక్టర్ ప్రారంభ ఉపన్యాసంలో వివరించగా, కురుపాం నియోజకవర్గ అభివృద్ధిని, ముఖ్యమంత్రి చేసిన అభివృద్థిని వివరించారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్ససత్యనారాయణ విద్యాభిృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని, వివిధ విద్యాపథకాలను వివరించారు. సీఎంకు జిల్లాతరుపున జిల్లా కలెక్టర్, సబ్ కలక్టర్లు సీఎం చిత్రపటాన్నిబహూకరించారు. సిఎం జగన్ కు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆమె భర్త జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్తురాజు ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, టిడ్కోచైర్మన్ జమ్మాన తదితరులు సత్కరించారు. సిఎం సభ విజయవంతం కావడంతో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. మన్యంజిల్లాలో మొదటిసారి సీఎం కార్యక్రమం జరగడం, విజయవంతం కావడంపట్ల జిల్లా కలెక్టర్ ఆనందాన్ని వ్యక్తంచేశారు. జిల్లాలోని అధికారుల సమిష్టి కృషితో, సహకారంతో విజయవంతం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img