పుంగనూరు ఘటన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కనుసన్నుల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు రెచ్చగొడితే నీ బుద్ధి ఎటు పోయిందని చంద్రబాబును ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఎస్పీజీ సెక్యూరిటీ కలిగిన నేత ఎటు వెళ్తున్నారనే విషయం ముందుగా చెప్పాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. పుంగనూరు ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి చంద్రబాబే బాధ్యత వహించాలని, అంతేకాదు టీడీపీ అధినేతపై చర్యలు తీసుకోవాలన్నారు.