Friday, June 14, 2024
Friday, June 14, 2024

జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేస్తా : నాదెండ్ల మనోహర్‌

జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేస్తానని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. సోమవారం గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల.మనోహర్‌ మాట్లాడుతూ … జనసేన పార్టీ రోజురోజుకూ బలపడుతోందని, జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. వైసిపి ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికిపోతున్నారని విమర్శించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థలకు ఎపి ప్రభుత్వం పంపిస్తోందని ఆరోపించారు. టిటిడి ఛైర్మన్‌గా భూమన నియామకం వల్ల ఒరిగిందేమీ లేదని నాదెండ్ల మనోహర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సర్పంచులను డమ్మీలుగా చేసి వాలంటీర్లు పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img