Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జగన్‌ మూర్ఖత్వానికి రాష్ట్రం బలి

. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను నాశనం చేశారు
. దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతా
. సంపద సృష్టించి పేదలను ధనవంతులుగా మారుస్తా
. మీడియాతో చంద్రబాబు చిట్‌చాట్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర విభజన వల్ల కన్నా వైసీపీ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మూర్ఖపు నిర్ణయాలకు రాష్ట్రం బలైందని చంద్రబాబు ఆవేదన చెందారు. ఏపీకి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టును జగన్‌ తన అసమర్థతో పూర్తి చేయలేకపోయారని, మరోవైపు రాష్ట్రానికి సంపద సృష్టించే అమరావతి రాజధానిని కక్షపూరితంగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. దీనివల్ల అంతిమంగా రాష్ట్రం, ప్రజలే నష్టపోయారన్నారు.
ఉండవల్లిలోని తన నివాసంలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులతో చంద్రబాబు బుధవారం చిట్‌చాట్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, పాలనా వ్యవహారాలు, ప్రజల సమస్యలు, టీడీపీ నిర్వహించబోయే కార్యక్రమాలపై చంద్రబాబు తన ఆలోచనలు పంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిందని, అందువల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమకు అనేక సవాళ్లు ఉంటాయన్నారు. అయితే తనకు ఉన్న బ్రాండ్‌తో, విధానాలతో వేగంగా సంపద సృష్టిస్తామని, తద్వారా పేదల జీవన ప్రమాణస్థాయి పెంచేలా, వారిని ధనవంతులుగా మార్చే మెరుగైన సంక్షేమ పథకాలు అందించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేసే మహాశక్తి పథకం మహిళల జీవితాల్లో భారీమార్పులు తీసుకొస్తుందన్నారు.
కక్షపూరిత రాజకీయాలతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ
గతంలో ఒక విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ది చేశామని, ఆ ఫలితాలు మన కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. అలాంటి రాజధాని మనకు ఉండాలని, పెట్టుబడులకు, ఉద్యోగాల కల్పనకు కేంద్రం కావాలని తాను అమరావతిని అభివృద్ధి చేస్తే…జగన్‌ తన కక్ష పూరిత రాజకీయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. ప్రజల ఆస్తిని నాశనం చేసే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు రాజధాని కేసు డిసెంబర్‌కు వాయిదా పడిరదని, అది ఎప్పుడు తేలుతుందో తెలియదన్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును జగన్‌ తన అసమర్థతతో నాశనం చేశారని ఆవేదన వెలిబుచ్చారు. పోలవరం పూర్తి అయి ఉంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీరు పుష్కలంగా అందేదన్నారు. కియా పరిశ్రమను తెస్తే అక్కడ భూములు ధరలు పెరిగాయి…సంపద సృష్టి అంటే ఇదే కదా అన్నారు. ఒక మూర్ఖుడి నిర్ణయానికి తెలుగు జాతి బలి అవ్వాలా…దీనిపై జనం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు జగన్‌పై ఉక్రోషంతో చేయడం లేదని, జరుగుతున్న నష్టం వల్ల ఆవేదనతో అంటున్నానని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో నోట్ల పంపిణీకి, అక్రమాలకు చెక్‌ పెట్టాలంటే పెద్దనోట్ల రద్దు జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ తప్పుడు పనులకు, రాజకీయ వ్యవహారాలకు పనిచేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. వలంటీర్లు ప్రభుత్వ సొమ్మును జీతంగా తీసుకుంటున్నారు…ప్రజలకు జవాబుదారీగా ఉండాలి… వారు ప్రభుత్వ సేవలకే పరిమితం కావాలి… కానీ, రాజకీయ పార్టీకి ఎలా పనిచేస్తారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీితో పొత్తు ఉంటుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా…తాను ఇప్పుడు పొత్తుల గురించి ఏమీ చెప్పలేనని, తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. జగన్‌ పాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాల్సిన అవసరం తనపై ఉందన్నారు. సీనియర్‌ రాజకీయ నేతగా అది తన బాధ్యత అని, ఒకవేళ ఆ పని సమర్థవంతంగా చేయలేకపోతే తరువాత ఆ బాధ తనకు ఎప్పటికీ ఉండి పోతుందని చంద్రబాబు చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ చిట్‌చాట్‌లో మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీడియా భాగస్వామ్యాన్ని గుర్తుచేశారు. మీడియా వాళ్లు కేసులకో, ఒత్తిళ్లకో భయపడితే….రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్లవుతారని చంద్రబాబు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img