Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

గుంటూరు ప్రజల వాణి పార్లమెంట్‌లో వినిపిస్తా..

సీపీఐ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్‌
విశాలాంధ్రపొన్నూరు: పొన్నూరు పట్టణంలో గురువారం ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్‌ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌ కుమార్‌, పొన్నూరు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జక్కా రవీంద్రనాథ్‌ ఆ పార్టీ నాయకులతో కలిసి భారీ రోడ్‌ షో నిర్వహిం చారు. ఇండియా కూటమి మేనిఫెస్టో కర పత్రాలను పంచుతూ తమ అభ్యర్థిత్వాలను బలపరిచి కంకికొడవలి, హస్తం గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం అంబేద్కర్‌ సెంటర్‌లో పార్లమెంట్‌ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరిగిన మూడు విడతల పోలింగ్‌లో ఎన్‌డీఏ కూటమి ఘోర పరాజయం పొంద నున్నట్లు స్పష్టమయ్యిందన్నారు. ఎన్‌డీఏ అధికా రంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తుం దని, దళితులు, అణగారిన వర్గాలు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, ఎన్‌డీఏ అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంట్‌ పరిధిలోని పొన్నూరు, చేబ్రోలు, పొన్నూరు రూరల్‌ మండలాలలో పది గ్రామాలలో విస్త్రత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు, బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, జేబీ శ్రీధర్‌, ఆరేటి రామారావు, దేవరకొండ శ్రీను, సుగుణమ్మ, రమణ, శ్రీమన్నారాయణ, యాటగిరి కోటేశ్వరమ్మ, షేక్‌ పజ్జురునిసా, రాపూరి కోటేశ్వరమ్మ, పన్నెం తిరుపతయ్య, ఇండ్ల దుర్గ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img