London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

సిపిఐ, ఎఐటియుసి నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం జిల్లా సిపిఐ, ఎఐటియుసి నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు కె రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలింగ్ అనంతరం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దాడులు, అల్లర్లు జరుగుతున్నాయన్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థిపై విచక్షణా రహితంగా దాడి జరిగిందన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత 3 రోజులుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలింగ్ అనంతరం తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటనలు, అల్లర్లను అణచివేయటంలో పోలీసులు విఫలం చెందారన్నారు . నిన్న తాడిపత్రిలో డిఎస్పి విఎస్ కె చైతన్య ప్రత్యేక పోలీసు బలగాలతో టిడిపి నేత జెసి ప్రభాకరరెడ్డితో సహా పలువురు తెలుగుదేశం సానుభూతిపరుల ఇళ్లను ముట్టడించి వీరంగం సృష్టించడం, పలువురిని ఇష్టారీతిన కొట్టడం జరిగినట్లు తెలుస్తోందన్నారు . ఈ ఘటనలో దివ్యాంగుడైన కిరణ్ తలపై డిఎస్పి చైతన్య లాఠీతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయమై కిరణ్ పరిస్థితి విషమంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగుడైన కిరణ్ను పరామర్శించేందుకు నేడు బయలుదేరిన సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శి సి. జాఫర్, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, సి. మల్లిఖార్జునలతోసహా సిపిఐ, ఎఐటియుసి నేతలైన ఎ. రాజారెడ్డి, రాజేష్, లింగమయ్య, ఇమామ్ తదితరులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందన్నారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు వైఫల్యం చెందడం విచారకరం అన్నారు. పోలీసులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై దాడులకు, అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గంపు చర్యా అని పేర్కొన్నారు . తాడిపత్రి డిఎస్పి దాడిలో తీవ్రంగా గాయపడిన దివ్యాంగుడు కిరణ్ ను పరామర్శించేందుకు సిపిఐ నేతలు వెళ్ళటం నేరమా? అని ప్రశ్నిస్తున్నాం. తాడిపత్రిలో దమనకాండకు కారకులైన డిఎస్పి చైతన్యను సస్పెండ్ చేయాలనిబీ అరెస్టు చేసిన సిపిఐ, ఏఐటియుసి నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాతంత్ర వాదులంతా పోలీసుల విపరీత చర్యలను, అక్రమ అరెస్టులను ఖండించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img