వ్యాపార లావాదేవీలే రాహుల్ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం కోర్టులో నిందితులను హాజరుపర్చారు. ఈ హత్య కేసుపై విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, వ్యాపారి రాహుల్ హత్య కేసులో 13 మంది పాత్ర ఉందని, ఓ అమ్మాయికి మెడికల్ సీట్ ఇప్పించే విషయంలోనూ వివాదం జరిగిందని చెప్పారు. పథకం ప్రకారమే రాహుల్‌ను హత్య చేశారని సీపీ తెలిపారు.