మంత్రి పేర్ని నాని
గ్రామ సచివాలయాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటనలు ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి పేర్ని నాని వెల్లడిరచారు. నెలలో 12 రోజుల పాటు ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాల సందర్శన ఉండాలని మంత్రి వర్గం సూచించిందని మంత్రి తెలియజేశారు.పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన అంశం కెబినెట్లో ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు. మెకానికల్ ఫెయీల్యూర్ వల్ల గేట్ కొట్టుకుపోయిందని ప్రాథమికంగా నిర్దారించారని ఆయన పేర్కొన్నారు.