Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

బాపట్లలో ఎన్నికల కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు

విశాలాంధ్ర – బాపట్ల: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా ప్రకటించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలు ఎప్పుడైనా ఈ ఫోన్ నెంబర్ల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. జిల్లాస్థాయి గ్రీవెన్స్ కమిటీ కంట్రోల్ రూమ్ ఆడిట్ ఆఫీస్ లో ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. గ్రీవెన్స్ కమిటీ కంట్రోల్ రూమ్ 08643 297801 నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. 1950 ఓటర్ హెల్ప్ లైన్ కలెక్టరేట్ లోని రూమ్ నెంబర్ 36 లో ఏర్పాటు చేశామని, 08643 297802 ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, సి-విజిల్ యాప్ అమలుపై కలెక్టరేట్ లోని రూమ్ నెంబర్ 36 లో 08643 297804 ఫోన్ నెంబర్ కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని డి ఆర్ సి హాల్లో మీడియా సెల్ మరియు సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు పనిచేసేలా 08643 297808 ఫోన్ నెంబర్ సిద్ధంగా ఉంచామన్నారు. వెబ్ కాస్టింగ్ మరియు వీడియోగ్రఫీ కొరకు డి ఆర్ సి హాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 08643 297811 ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్పష్టమైన వివరాలతో కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించవచ్చని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img