Monday, April 22, 2024
Monday, April 22, 2024

మోదీపై దిగజారుతున్న నమ్మకం

డా.జ్ఞాన్‌ పాఠక్‌

ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ ఇంతకాలం తప్పుడు కథనాలతో ఓటర్లను నమ్మించ గలిగాయి. వినాయకుడి విగ్రహాలు కూడా పాలు తాగుతాయని నమ్మించాయి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రజలు ఈ శక్తులపట్ల విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇంతకాలం రెండు రకాల ఎన్నికల వ్యూహాలు పన్నుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. గత పది సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలను నిజాలుగా నమ్మించి ఓటర్లను బుకాయిస్తున్నారు. రెండవ ఎత్తుగడ హిందూమత అజెండాతో గెలుపొందగలిగారు. బీజేపీ, మోదీ మోసాలను ప్రజలు ఇక నమ్మే పరిస్థితిలో లేరు. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరిగే నాటికి మళ్లీ మత అజెండాను అబద్ధాలు, అతిశయోక్తులతో కలిపి పెద్దఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఈ కుహకాలను జనం పెద్దగా నమ్మడంలేదు. రామరాజ్యం వేయి సంవత్సరాల వరకు కొనసాగుతుందని ఒక ప్రచారాన్ని పెద్దఎత్తున సాగిస్తున్నారు. అంతేకాదు, మోదీ పదకొండవ శతాబ్ది హిందూదేవుడు విష్ణుగా అవతరించాడని మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకుడు పొగుడుతున్నారు. రాముడు విష్ణువు ఏడవ అవతారమని, మధురలో కృష్ణుడు ఎనిమిదవ అవతారమని జనానికి చెబుతూ మోసం చేస్తున్నారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంలో నరేంద్రమోదీ రాముడు అవతారమని పొగిడారు. అబద్ధాలకు, మోసాలకు ఒక హద్దులేకుండా పోయింది. గత10ఏళ్లలోనూ మోదీ చేసిన మోసాలు, తప్పులు అంత తక్కువేమీకాదు. జనాన్ని మాటలతో మోసం చేయడం ఆయనకు కొట్టిన పిండి. తన ప్రభుత్వం సాధించిన బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రపంచమంతా పొగుడుతోందని చెప్పుకోవడమే హాస్యాస్పదం. అన్ని దేశాలూ భారతదేశం వైపే చూస్తున్నాయని మోసపుమాటలు చెబుతున్నారు. అంతకంటే పెద్ద అబద్ధం ప్రపంచంలో భారతదేశం ఐదవ పెద్ద ఆర్థికవ్యవస్థ కలిగి ఉందని నమ్మించేం దుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 2047 వరకు అమృతకాలమని ఆనాటికి ప్రపంచంలో అతిపెద్ద మూడవ ఆర్థికవ్యవస్థగా దేశం మారిపోతుందని మాట్లాడుతున్నారు. మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందనే దానిపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. భారతదేశాన్ని ప్రపంచం వాస్తవంగా ఎలా చూస్తుందో పరిశీలించవలసిందే. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగి ఉందని చెప్పుకోవడం అతి పెద్ద మోసం. ఈ విధంగా అనేక వాస్తవాలు ఈ ప్రభుత్వం దాచిపెడుతోంది. దాచిపెడుతోందన్న నిజాన్ని గోదీ మీడియా ప్రజలకు తెలియకుండా చేస్తోంది. ప్రపంచ బ్యాంకు సైతం భారత్‌ మధ్య తరగతి ఆదాయం గల దేశమని స్పష్టం చేసింది. అతి తక్కువ ఆదాయాన్ని పొందే పేదలు చాలా ఎక్కువగా ఉన్నారు. దేశంలో 97కోట్ల ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేనిస్థితి. ఎనభై కోట్లమంది ప్రధాని గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన పథకం కింద ఇచ్చే ధాన్యంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. మరోవైపు మోదీ మాత్రం 25కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బైటపడ్డారని ప్రచారం చేస్తున్నారు. 2013లో ఆహారభద్రతా చట్టాన్ని తీసుకువచ్చిన నాటినుంచి పేదప్రజలు ఆనాడు ఉన్న సంఖ్య కంటే ఏమీ తగ్గలేదు. ప్రపంచంలోనే పేదలు అత్యధికంగా ఉన్న దేశం మనది. పేదల సంఖ్య ఎక్కువ అని అనేక సర్వేలు చెప్పాయి. 2022లో ప్రపంచబ్యాంకు, ఎగువ తరగతి ఆదాయంకల దేశంగా ఎదగడానికి కనీసం దశాబ్దికాలం పడుతుందని ప్రకటించింది. తాజాగా వికసిత భారత్‌గా గ్యారంటీగా ఎదుగుతుందని కొత్త నినాదాన్ని మొదలుపెట్టారు. ఒకవైపు దేశంలో అపారంగా ఆర్థిక అసమానతలు పెరుగుతుండగా, మోదీ ప్రచారం భిన్నంగా ఉంటోంది. దేశంలో ఇరవై కంపెనీలు 60శాతం సంపదను కలిగి ఉండగా, 70శాతం మంది అతి తక్కువ సంపదను కలిగి ఉన్నారు. ప్రపంచంలో అతి తక్కువ సంతోషం కలిగిన దేశం నేపాల్‌, చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంకల కంటే కూడా సంతోషంలో భారత్‌ తక్కువ ర్యాంకు కలిగింది. ుుఎన్‌ఎస్‌బీఎస్‌ఎన్‌ఎస్‌ 2022లో అధ్యయనం చేసిన 146దేశాలలో భారత్‌ 136వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాలన నాసిరకంగా ఉండటమే ఇందుకు కారణం. మానవ అభివృద్ధి సూచి ప్రకారం, 202122లో 191 దేశాలలో భారత్‌ ర్యాంకు 132గా యుఎన్‌డీపీ ర్యాంకును ప్రకటించింది. అసమానతలలో 152దేశాలలో ఇండియా 108వ స్థానంలో నిలిచింది. సామాజిక అభివృద్ధి సూచీ 2022లో 169 దేశాలలో చేసిన అధ్యయనం ప్రకారం, ఇండియా 110వ స్థానంలో నిలిచింది. 2024లో ఇండియా ఏ స్థానంలో ఉంటుందో ఊహించవచ్చు. 80 దిగువనున్న దేశాలలో 15వ స్థానం నుంచి 5.67స్థానానికి మరింతగా దిగజారింది. అయు:ప్రమాణం, రాజకీయ స్వేచ్ఛ, విడాకుల రేటు, స్త్రీపురుషుల అసమానత, ప్రభుత్వంలో అవినీతి, హత్యలు, నిరుద్యోగంరేటు, దిగజారుతున్న వాతావరణం లాంటి అనేక విషయాలను తీసుకుని ర్యాంకింగ్‌లను నిర్ణయిస్తారు. అసాధారణ వేగంతో మోదీ పాలనలో దేశం వృద్దిచెందుతోందని అత్యంత తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. 2021లో కామన్‌ వెల్త్‌ (లండన్‌) విడుదల చేసిన నివేదిక ఆధారంగా వరల్డ్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌ ప్రకారం 181 దేశాలలో మన దేశం 122వ స్థానంలో ఉన్నది. ప్రపంచ స్త్రీ, పురుష అంతరం నివేదిక ప్రకారం, ప్రపంచ ఆర్థిక వేదిక 2023లో 146 దేశాలలో అధ్యయనానికి ఇండియా 127వ ర్యాంకులో ఉన్నట్లు ప్రకటించింది. 2023లో యుఎన్‌డీపీ నివేదిక ప్రకారం, ఇండియా 191 దేశాలలో 122వ స్థానంలో ఉన్నది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు తమ పాలనలో నారీశక్తిని (మహిళల సాధికారిత) సాధించినట్లు ప్రచారం సాగిస్తున్నాయి. 2023 ఐక్యరాజ్యసమితి అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 60శాతం ప్రసూతి మరణాలు, పుట్టుకలోనే మరణాలు భారత్‌లోనే ఉన్నాయి. వాక్‌ఫ్రీ ప్రకారం ప్రపంచంలో 11మిలియన్లమంది ఆధునిక బానిసత్వంలో ఉండగా, భారత్‌లో ఎక్కువ మంది ఉన్నారు. ఎన్నికల ప్రజాస్వామ్య సూచీలో 202 దేశాలలో మన దేశం 108వ స్థానంలో ఉన్నదని వీ`డెమ్‌ ప్రజాస్వామ్య నివేదిక 2023లో ప్రకటించింది. వాస్తవంగా అభివృద్దికి సంబంధించి లేదా పరిపాలన, ప్రజాస్వామ్యం తదితర అనేక అంశాలలోనూ భారత్‌ వెనకబడి ఉన్నదన్న విషయాన్ని మోదీ ప్రభుత్వం దాచిపెడుతోంది. ప్రపంచ పత్రికాస్వేచ్ఛ సూచీ 2023లో ఇండియా 180 దేశాలలో 161స్థానంలో ఉంది. ఇదే సూచీ 2022లో 150వ స్థానంలో ఉండి మరింత దిగజారింది. ఏ సూచీ చూసినా పరిస్థితి ఇదే, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జరగనున్న ఎన్నికల్లో ప్రజలు స్పందించవలసిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img