Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఏపీలో సీఎన్‌జీ ధరలు తగ్గించిన ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌

విశాలాంధ్ర/అమరావతి: ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో తన సీఎన్‌జీ ధరలను తగ్గించింది. ఏపీలో ఖనిజ వాయు ఇంధనం వాడకం పెరిగిన నేపథ్యంలో దేశంలోనే ప్రముఖ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ ఆంధ్రప్రదేశ్‌లో తన సీఎన్‌జీ ధరను కిలోకు 2.50 రూపాయలను తగ్గించింది. ఇది మార్చి 7వ తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. సీఎన్‌జీ వాడుతున్న వాహనదారుల పొదుపును ప్రోత్సహించడమే ఈ సవరించిన సీఎన్‌జీ రేట్ల ఉద్దేశం. ఏపీలో ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప జిల్లాల్లో తగ్గిన సీఎన్‌జీ రేట్లు అమల్లోకి వస్తున్నాయి. ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ మార్కెటింగ్‌ ఉపాధ్యక్షులు తివాహర్‌ బెథూన్‌ మాట్లాడుతూ, డీజిల్‌, పెట్రోల్‌లతో పోల్చితే సీఎన్‌జీ వాడకం వల్ల 35% నుంచి 50% వరకు డబ్బు ఆదా అవుతుందని అన్నారు. సీఎన్‌జీ వాడే 3డబ్ల్యు ఆటోలు, కార్లు, చిన్న వాణిజ్య వాహనాలు, ట్రక్కులు, బస్సులను ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ సంస్థ గొప్ప ఆఫర్‌ను ఇస్తున్నదని, 2.50 రూపాయల తగ్గింపు వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img