Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఏఐసీటీఈతో సర్వీస్‌నౌ భాగస్వామ్యం


ముంబయి: ప్రముఖ డిజిటల్‌ వర్క్‌ఫ్లో కంపెనీ సర్వీస్‌నౌ, తమ సర్వీస్‌నౌ ప్లాట్‌ఫారమ్‌ పై మొదటి సంవత్సరంలో 10,000 మంది విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)తో తాజాగా అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ఈ ఎంఓయూ మూడు సంవత్సరాలలో 25,000 మంది విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేసుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో మొదటి అడుగు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యాలు, సామర్థ్యాలను అందిస్తూనే, ప్రపంచ మరియు కేంద్రీకృత అభ్యాసాన్ని విద్యార్థులకు ఈ భాగస్వామ్యం అందిస్తుంది. ఈ ఎంఓయూ నౌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లో సర్వీస్‌నౌ అడ్మినిస్ట్రేటర్‌, డెవలపర్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా నిరంతర విద్యా మార్గాన్ని సృష్టిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img