Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

రజనీ సినిమాలో నాని?

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించిన జైలర్‌ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది రజనీ 169వ చిత్రం. కాగా రజనీకాంత్‌ మరోవైపు జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ డైరెక్షన్‌లో ‘తలైవా 170’ కూడా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే ఓ అప్‌డేట్‌ వచ్చింది. తాజాగా మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది. తలైవా 170వ చిత్రంలో ప్రత్యేక పాత్ర కోసం మేకర్స్‌ న్యాచురల్‌ స్టార్‌ నానిని సంప్రదించారట. అంతేకాదు ఈ చిత్రంలో నాని పాత్ర 20 నిమిషాలపాటు ఉండనుందట. ఇదే నిజమైతే సిల్వర్‌ స్క్రీన్‌పై సూపర్‌ స్టార్‌, మెగాస్టార్‌, న్యాచురల్‌ స్టార్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఖాయమైపోయినట్టే. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుబాస్కరన్‌ నిర్మిస్తుండగా.. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. తలైవా 170 ప్రాజెక్ట్‌ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది. టీజే జ్ఞానవేళ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను సిల్వర్‌ స్క్రీన్‌పై ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img