Monday, May 20, 2024
Monday, May 20, 2024

రామాయపట్నం సముద్ర తీరాన్ని పసుపు నీళ్లతో శుద్ది

ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా రాష్ట్ర యువత ను, ప్రజలను నట్టేట ముంచి,రాష్ట్రానికి అశుభం గా మారిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించే ప్రాంతాలను పసుపు నీళ్లతో శుద్ది చేయాలని తెలుగుయువత సంకల్పించింది. ఇందులో భాగంగా కందుకూరు తెలుగుయువత ఆధ్వర్యంలో ఈ రోజు రామాయపట్నం సముద్ర తీరం వద్ద పసుపు శుద్ది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కాకర్ల. తిరుమల నాయుడు, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ మరియు ముఖ్య తెలుగుయువత నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడుతూ…
ప్రతీ యేడు జాబ్ కేలండర్ ప్రకటిస్తానని, 2.4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను ఇస్తామని పాదయాత్ర సమయం లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చాక ఆ ఊసే మరిచారు.
ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేస్తున్న ఉద్యోగులందరికీ శాశ్వత ఉద్యోగులు గా మార్చుతానని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చాక గాలికి వదిలేశారు.
ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతీ పంట కు గిట్టుబాటు ధర కల్పిస్తానని ఊదర గొట్టిన జగన్మోహన్ రెడ్డి వరికి మద్దతు ధర కల్పించడం లో ఘోరం గా విఫలం అయ్యారు. అధికారం లోకి వచ్చిన వారం లోపు సీపీఎస్ ను రద్దు చేస్తామని ప్రగల్బాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నేడు ఉద్యోగులను మోసం చేశారు.అనంతరం తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ మాట్లాడుతూ. 45 సం.లు దాటిన బలహీన వర్గాలకు చెందిన మహిళలకు పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట మార్చారు.
ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మవడి ఇస్తానని హామీ ఇచ్చి, ఒక్కరికే పరిమితం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి.అన్న క్యాంటీన్ ల ద్వారా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేవలం రూ. 5/- లకే ఆహారం అందించగా, అధికార అహం తో అడ్డుకుని పేదవాడి పొట్ట కొట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చక, బూటకపు వాగ్దానాలు చేసుకుంటూ, బూటకపు శంఖుస్థాపన లు, భూమి పూజలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నడయాడే ప్రతీ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేయాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img