Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

గవర్నర్‌ స్థానంపై నీలి నీడలు

తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్‌ రాజీనామా చేయడం దానిని రాష్ట్రపతి ఆమోదించడం అకస్మాత్తుగానే జరిగిపోయాయి. తాను మళ్లీ ప్రజా జీవనంలోకి అంటే క్రియాశీల రాజకీయాలలో ప్రవేశిస్తానని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తమిళసై విన్నవించారట. ఆ పెద్దలు ఆమె కోరికను వెంటనే ఆమోదించేశారు. తమిళసై పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నరుగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. తమిళసై స్థానంలో జార్ఖండ్‌ గవర్నరుగా ఉన్న రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నరుగా నియమించడంతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బాధ్యతలు కూడా అప్పగించారు. రాధాకృష్ణన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించడం కూడా పూర్తి అయింది. తమిళసై క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించడంలో తప్పులేదు. అది ఆమె హక్కు. కానీ క్రియాశీల రాజకీయాలలో ఉన్న వారిని గవర్నర్లుగా నియమించడం వారు నేరుగా మళ్లీ క్రియాశీల రాజకీయ రంగంలోకి దూకడం గవర్నర్ల నియామకం జరుగుతున్న తీరుపై కచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయి. రాజకీయ నిరుద్యోగులకు, క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారు తమ సొంత రాష్ట్రంలోనే ఉంటే ఆ రాష్ట్ర రాజకీయాలలో, ప్రభుత్వ నిర్వహణలో జోక్యం చేసుకుని విపత్కర పరిస్థితి సృష్టిస్తున్నారని భావించి వారిని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నరుగా నియమించడం పరిపాటి అయిపోయింది. 1968-69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడిరచిన డా.మర్రి చెన్నా రెడ్డిని ఇలాగే ఉత్తరప్రదేశ్‌ గవర్నరుగా నియమించారు. ఆ తరవాత ఆయన మళ్లీ రాష్ట్ర రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహించడమే కాక ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ సిఫార్సు ఆధారంగా నియమించడం ఇప్పుడున్న పద్ధతి. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు అన్న మాటలోనే ఆ నియామకాలలో అధికార పార్టీ రాజకీయాలు ఉంటాయనడంలో అనుమానమే అక్కర్లేదు. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. కానీ చాలామంది గవర్నర్లు తాము గవర్నరుగా ఉన్న రాష్ట్రం కనక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందింది కాకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వ పాలనా నిర్వహణకు అడుగడుగునా అడ్డంకులు కల్పించడమూ మామూలు అయిపోయింది. అంటే గవర్నర్ల నియామకం రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతిలో కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చేస్థాయికి దిగజారి చాలా కాలమే అయింది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలోనూ గవర్నర్ల నియామకంపై అనుమానాలు తలెత్తాయి. ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాలకు ఆటంకం కలిగిస్తున్నారనే నాయకులను ఏదో రాష్ట్రానికి గవర్నరుగా నియోగించేవారు. లేదా క్రియాశీల రాజకీయాలలో వారివల్ల ఫలితం లేదనుకున్నప్పుడు కూడా రాజ్‌భవన్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత గవర్నర్ల నియామకానికి మరోకోణం అదనంగా వచ్చి చేరింది. చిరకాలం ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో చురుకుగా పనిచేసిన వారికి గౌరవ స్థానం కల్పించడానికి గవర్నర్‌ పదవులను వినియోగిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత గవర్నర్లుగా నియమితులైన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, తమిళనాడు గవర్నర్‌ రవి ఎలా వ్యవహరించారో చూశాం. రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణకు దిగిన గవర్నర్లలో మునుపటి పుదుచ్చేరి గవర్నర్‌ కిరణ్‌ బేడీ, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన బన్వారి లాల్‌ పురోహిత్‌ కూడా ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అడ్డంకులు కల్పించడమే వీరు పనిగా పెట్టుకున్నారు. గవర్నర్ల నియామకానికి అనుసరించవలసిన విధానాలను నిర్దేశిస్తూ సర్కారియా కమిషన్‌ సిఫార్సులను మొదట కాంగ్రెస్‌, ప్రస్తుతం బీజేపీ పట్టించుకున్న పాపాన పోలేదు.
తెలంగాణ ఏర్పడిన తరవాత అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి గవర్నరుగా ఉన్న ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహం గవర్నరుగా కొనసాగారు. ఆయన తమిళనాడుకు చెందిన వారే. ఆ తరవాత 2019 నవంబర్‌ లో తమిళసైని తెలంగాణ గవర్నరుగా నియమించారు. ఇప్పుడు గవర్నర్‌ బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్‌ కూడా తమిళనాడు వారే. రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకులు కల్పించడంలో తమిళసై ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను, రవిని మించి పోలేదు కానీ ఆమె కూడా వివాదాలలో చిక్కుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్‌ రావుకు, గవర్నర్‌ తమిళసైతో ఎదురైన విభేదాలు రచ్చకెక్కాయి. కె.సి.ఆర్‌. గవర్నర్‌ను పట్టించుకోవడమే మానేశారు. 2022 మార్చిలో తెలంగాణ బడ్జెట్‌ సమావేశం ప్రారంభమైనప్పుడు మామూలు పద్ధతుల్లో అయితే అది ఆ ఏడాదిలో తొలి సమావేశం కనక గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం కావాలి. కానీ అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే 2022 జనవరిలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించారు. దీనిమీద తమిళసై బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కొత్త అసెంబ్లీ సమావేశం కాదని అందువల్ల గవర్నర్‌ ప్రసంగం అవసరం లేదని కె.చంద్రశేఖర రావు ప్రభుత్వం వాదించింది. ఈ వాదనను గవర్నర్‌ అంగీకరించలేదు. మొత్తం మీద గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు జరిగిపోయాయి. ఏడాది ఆరంభంలో జరిగే శాసనసభ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో మొదలు కావాలన్న సంప్రదాయానికి విఘాతం కలిగింది. ఈ విషయంలో గవర్నరుకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాలు ఎలా ఉన్నప్పటికీ గవర్నర్‌ ప్రసంగం లేనందువల్ల అంతకు ముందు సంవత్సరంలో ప్రభుత్వ పనితీరును బేరీజువేసే అవకాశం దక్కలేదు. ఒక సంప్రదాయానికి చెల్లు చీటీ రాసినట్టయింది. 2022లో బడ్జెట్‌ సమావేశాలకు ముందు గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని చెప్పారని, చివరకు లేదన్నారని తమిళసై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమిళసై బడ్జెట్‌ సమావేశాలను అనుమతించారు. లేకపోతే ఆర్థికబిల్లు శాసనసభలో ప్రవేశ పెట్టడానికి అవకాశమే ఉండేది కాదు. సహకార సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడంకోసం బడ్జెట్‌ ప్రతిపాదనకు తాను అడ్డు చెప్పలేదని తమిళసై అప్పుడు వివరణ కూడా ఇచ్చారు. అంతకు ముందు కూడా కె.సి.ఆర్‌. ప్రభుత్వానికి, గవర్నరుకు మధ్య విభేదాలు తలెత్తాయి. పి.కౌశిక్‌ రెడ్డిని శాసనమండలి సభ్యుడిగా నియమించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన సిఫార్సును గవర్నర్‌ ఆమోదించలేదు. శాసనమండలి ప్రోటెం స్పీకర్‌ నియామకంలో కూడా ప్రభుత్వానికి, గవర్నరుకు మధ్య విభేదాల కారణంగా జాప్యం అయింది. తమిళసై నేరుగా క్రియాశీల రాజకీయాల్లోంచి వచ్చిన వారే. ఇప్పుడూ ఆమె దక్షిణ తమిళనాడు నుంచి లోకసభకు పోటీ చేస్తారంటున్నారు. గవర్నర్‌ కాక ముందు తమిళసై 2007 నుంచి 2010వరకు బీజేపీలో అనేక బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. 2019లో ఆమె తూత్తుకూడి నుంచి పార్లమెంటుకు పోటీచేసి డి.ఎం.కె. అభ్యర్థి కనిమోళి చేతిలో ఓడిపోయారు. గవర్నర్ల నియామకంలో రాజకీయ ప్రయోజనాలు, గవర్నర్‌ పదవిలో ఉన్న వారికి రాజకీయాలమీద మక్కువ తీరకపోవడం గవర్నర్‌ పదవినే ప్రశ్నార్థకం చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img