Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

తుత్తినియలవుతున్న ఎల్గార్‌ పరిషత్‌ కేసు

వివాదాస్పదమైన ఎల్గార్‌ పరిషత్‌ కేసులో వెర్నాన్‌ గొన్సాల్వెస్‌, అరుణ్‌ ఫెరీరాకు శుక్రవారం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరుచేసింది. వీరిద్దరికీ వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యా ధారాలను బట్టిచూస్తే వారిని నిరంతరం నిర్బంధంలో ఉంచవలసిన అవసరం లేదని న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్‌, సుధాన్శు ధులియాతో కూడిన బెంచి వ్యాఖ్యానించింది. విచిత్రం ఏమిటంటే 16 మంది నిందితులను అయిదేళ్ల కింద అరెస్టుచేసి జైలులో ఉంచారు. వీరిలో సుధా భరద్వాజ్‌, విప్లవకవి వరవరరావు, ఆనంద్‌ తెల్తుంబ్డేకు ఇదివరకే బెయిలు మంజూరు అయింది. వీరిని చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద 2018లో అరెస్టు చేశారు. శుక్రవారం బెయిలు మంజూరు అయిన ఫెరీరా, గొన్సాల్వెస్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సరం దాటింది. ఇంతకు ముందు వీరు బెయిలుకోసం పెట్టుకున్న అర్జీలను ఎన్‌.ఐ.ఎ. ప్రత్యేక కోర్టు, బొంబాయి హైకోర్టు నిరాకరించడంతో వీరు ఏడాదికింద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరిని అరెస్టు చేసి అయిదేళ్లు దాటినా విచారణ ఇప్పటికీ ప్రారంభం కానందున బెయిలు మంజూరు చేయాలని వీరి న్యాయవాదులు రెబెకా జాన్‌, ఆర్‌.బసంత్‌ వాదించారు. ఈ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించింది. 2018 జనవరిలో పుణే పోలీసులు ఎల్గార్‌ పరిషత్‌ కేసు మోపారు. ఆ తరవాత  2020లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.) ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ కేసు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. భీమా కోరేగావ్‌ పోరాటానికి 200 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. పుణే పోలీసులు మోపిన కేసులో 16 మంది నిందుతులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందువల్లే అక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు ఆరోపించారు. వీరికి మోదీ ప్రభుత్వం అర్బన్‌ నక్సలైట్లు అని ముద్రకూడా వేసింది. ఈ కేసులో నిందితుడైన హక్కుల పోరాట యోధుడు స్టాన్‌ స్వామి నిర్బంధంలో ఉండగానే మరణించారు. మంచినీళ్ల గ్లాసు కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్న స్టాన్‌స్వామికి ఆయన కళ్లజోడు ఇవ్వకుండా మొదట్లో నానా రకాలుగా హింసపెట్టారు. స్టాన్‌స్వామికి సరైన వైద్యం అందించనందువల్లే ఆయన నిర్బంధంలో ఉండగానే మరణించారన్నది బహిరంగ సత్యం. ఈ పదహారు మందికి నిషేధంలో ఉన్న మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వాదించారు. దీనికి సంబంధించి పోలీసులు చూపిన ఆధారం ఏమిటంటే వారి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలలో సాక్ష్యాధారాలు ఉన్నాయని. కానీ వివాదాస్పదమైన, దేశాన్ని కుదిపేసిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగించి వారి కంప్యూటర్లు మొదలైనవాటిలో పోలీసులే ఈ సాక్ష్యాధారాలు ప్రవేశ పెట్టారని తేలింది. ఈ వాదనను అనేక ఫారెన్సిక్‌ సంస్థలు సవాలు చేశాయి. మన దేశంలోని ది వైర్‌ వార్తా సంస్థ, మసాచుసెట్స్‌ లోని ఆర్సెనల్‌ కన్సల్టింగ్‌ సంస్థ చేసిన పరిశోధనలో నిందితుల ఎలక్ట్రానిక్‌ పరికరాలలో ఉందంటున్న సమాచారం పోలీసులు అక్రమంగా జొప్పించిందే అని తేలింది. ఈ కేసులో నిందితుడైన రోనా విల్సన్‌ ఫోన్లో ఉన్న సమాచారాన్ని బట్టి అక్రమంగా వారికి వ్యతిరేకమైన సమాచారం జొప్పించినట్టు తేలింది. ఫెరీరా, గోన్సాల్వెస్‌కు బెయిలు మంజూరు చేయడానికి విధించిన షరతులలో ప్రధానమైంది వారు మహారాష్ట్ర వదిలి వెళ్లకూడదని. వారు ఒకే ఒక ఫోన్‌ వాడాలని, వారు ఎక్కడ ఉంటున్నారో పోలీసులకు తెలియజేయాలన్న షరతు కూడా ఉంది. వీరిని జైలులో ఉంచడానికి అవసరమైన సమాచారం ఏదీ ఎన్‌.ఐ.ఎ. అందించలేక పోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ధారణకు వచ్చారు. అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ధారణకు రావడానికి చాలా ప్రాధాన్యం ఉంది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసు నమోదైందన్నది ప్రత్యేకంగా గుర్తించవలసిన అంశం. అక్కడ బీజేపీ ప్రభుత్వం పడిపోగానే కేంద్రప్రభుత్వం ఈ కేసు విచారణను ఎన్‌.ఐ.ఎ.కు అప్పగించడమే మేధావులను, న్యాయవాదులను, రచయితలను పనిగట్టుకుని ఈ కేసులో ఇరికించారనడానికి ప్రధాన ఆధారం. ఇవన్నీ అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వ దురుద్దేశపూరిత వ్యవహార సరళిని గుర్తించడానికి ఇంతకన్నా ఏం రుజువులు కావాలి?

ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితులను నిరవధికంగా జైలులో ఉంచడానికి ప్రాసిక్యూషన్‌ పన్నిన కుట్ర ఏమిటో సుప్రీంకోర్టు గ్రహించి నట్టుంది. అందుకే ఎన్‌.ఐ.ఎ. వాదనను సుప్రీంకోర్టు మూడు ప్రధాన భాగాలుగా విడగొట్టి తుత్తినియలు చేసింది. మొట్ట మొదట నిందితులకు తీవ్రవాద సంఘటనలో సంబంధాలున్నాయన్న ఆరోపణలనే సుప్రీంకోర్టు ప్రశ్నార్థకం చేసింది. ఫెరీరా, గొన్సాల్వెస్‌ దగ్గర దొరికాయంటున్న సమాచారం నిషేధిత సమాచారం అనడానికి వీలులేదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వారి దగ్గర దొరికిందంటున్న సమాచారం వారు రాసింది కాదని సుప్రీంకోర్టు నిర్ధారించింది. అలాంటి సాహిత్యం వారి దగ్గర ఉండడమే వారు దోషులనడానికి నిదర్శనం కాదని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫెరీరా దగ్గర అక్రమ నిధులు ఉన్నాయన్న వాదనను కూడా సుప్రీంకోర్టు విశ్వసించలేదు. ఆ డబ్బులు నిందితుల తరఫున కేసులు వాదించడానికి ఉద్దేశించిందని విడమర్చింది. నిందితులకు బెయిలు నిరాకరించేటప్పుడు వీరి మీద మోపిన ఆరోపణలు నిజమని ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవన్న అంశాన్ని హైకోర్టు పట్టించుకోలేదని కూడా అత్యున్నత న్యాయస్థానం భావించింది. వీటన్నింటికీ మించి ఫెరీరా వృత్తిరీత్యా న్యాయవాది. ఆయనకు ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ లాయర్స్‌ (ఐ.ఎ.పి.ఎల్‌.) తో సంబంధం ఉందని కూడా ప్రాసిక్యూషన్‌ అంటోంది. ఈ న్యాయవాదుల సంస్థ మావోయిస్టు పార్టీకి అనుబంధ సంస్థ అని ఎక్కడా రుజువు కాలేదు. దీనికి తగిన ఆధారాలూ లేవు. ఫెరీరా, గొన్సాల్వెస్‌ దగ్గర దొరికాయంటున్న ఆధారాలు నిజానికి వారివి కావు. ఈ కేసులో బెయిలు మీద విడుదలైన ఆనంద్‌ తెల్తుంబ్డే తమ్ముడు మిలింద్‌ తెల్తుంబ్డే అజ్ఞాతవాసంలో ఉన్న మావోయిస్టు అంటారు. ఆయన పోలీసు కాల్పుల్లో మరణించాడు. తమ్ముడైనంత మాత్రాన ఆనంద్‌ తెల్తుంబ్డే కూడా మావోయిస్టు అన్న వాదనను ఇదివరకే న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆనంద్‌ తెల్తుంబ్డే విద్యావేత్త. ఆయన ఆ హోదాలో విదేశాలకు వెళ్లడం కూడా ప్రాసిక్యూషన్‌కు మావోయిస్టు కార్యకలాపంగా తోచింది. వీరంతా కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చడానికి కుట్రపన్నారన్న ఆరోపణ కూడా ఉంది. ఇంతటి తీవ్రమైన ఆరోపణలున్నప్పుడు విచారణ ప్రారంభించకుండా నిరవధికంగా జైలులో ఉంచుతున్నారంటేనే ప్రభుత్వ దురుద్దేశం ఏమిటో అర్థం అవుతూనే ఉంది. మానవ హక్కులకోసం పోరాడేవారిని ఈ కేసులో నిందితులంటున్నారు తప్ప వారికి మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నట్టు ప్రాసిక్యూషన్‌ నమ్మదగిన సాక్ష్యాధారాలు ఏవీ చూపలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం కేంద్ర ప్రభుత్వం చట్టాలను ఎంతగా దుర్వినియోగం చేస్తోందో రుజువు అవుతోంది. మోదీ ప్రభుత్వం తనను విమర్శించే వారిని జైళ్లల్లో సుదీర్ఘకాలం నిర్బంధించి అదే పెద్దశిక్షగా మార్చేస్తోంది. విచారణ ప్రారంభించకపోవడానికి ఈ దృక్కోణమే ప్రధానపాత్ర పోషిస్తోంది. మానవహక్కుల పేరెత్తడమే మోదీ హయాంలో పెద్ద అపరాధంగా తయారైంది. ఎన్‌ఐఎ కూడా ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ లాగా ప్రత్యర్థులను వేటాడేందుకు తయారవుతుందేమో!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img