Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

దిల్లీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే బిల్లు

రాష్ట్రం కాని రాష్ట్రమైన దిల్లీని నిర్వీర్యం చేయడానికి ఉద్దేశించిన బిల్లుపై గురువారం లోకసభలో చర్చ ప్రారంభం అయింది. ఈ బిల్లును మంగళవారం ప్రవేశ పెట్టారు. బుధవారమే చర్చ జరగాల్సింది. కానీ బుధవారం సభ జరగకుండానే వాయిదా పడినందువల్ల గురువారం చర్చ మొదలైంది. దిల్లీకి శాసనసభ ఉన్నప్పటికీ దానిని రాజధాని ప్రాంతంలో భాగంగా పరి గణిస్తున్నారు. అంటే దిల్లీ అటు కేంద్ర పాలిత ప్రాంతమూ కాదు. ఇటు పూర్తి స్థాయి రాష్ట్రమూ కాదు. దిల్లీ ప్రభుత్వం అధీనంలో పనిచేసే ప్రభుత్వ ఉన్నతోద్యోగులను నియమించే అధికారం దిల్లీ ప్రభుత్వానికి ఉంది అని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మోదీ సర్కారుకు మింగుడు పడలేదు. అసలు అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి కంకణం కట్టుకున్న మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది రోజులకే మే 19న ఆర్డినెన్సు జారీ చేసింది. ఆ ఆర్డినెన్సు స్థానంలో ఇప్పుడు బిల్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల నియామకం, బదిలీలపై దిల్లీ ప్రభుత్వానికి అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఈ బిల్లు ఆమోదిస్తే వమ్ము అవుతుంది. భూమి, పోలీసులు, శాంతి భద్రతలు లాంటివి మొదటి నుంచీ కేంద్రం పరిధిలోనే ఉన్నాయి. ఉన్నతాధికారులను నియమించడానికి దిల్లీ ప్రభుత్వానికి ఇన్నాళ్లుగా ఉన్న అధికారం లేకుండా చేయడానికి మోదీ సర్కారు రంగం సిద్ధంచేసింది. రాజ్యాంగం ప్రకారం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మంత్రివర్గం సిఫార్సుల మేరకే నడుచుకోవాలి తప్ప స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ 2015లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెఫ్టినెంట్‌ గవర్నర్లుగా పనిచేసిన వారందరూ ప్రభుత్వ నిర్వహణలో అడుగడుగునా అడ్డు తగులుతూనే ఉన్నారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు చట్టం అయితే దాదాపు సర్వాధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతిలోనే ఉంటాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కనక ఆయన సహజంగానే కేంద్రం చెప్పినట్టే నడుచుకుంటారు. స్వతంత్రంగా, రాజ్యాంగ నిర్దేశం ప్రకారం నడుచుకునే లెఫ్టినెంట్‌ గవర్నర్లు దాదాపు ఎనిమిదేళ్ల నుంచి మచ్చుకు కూడా లేరు. దిల్లీకి విశిష్ట స్థానం ఉంది కనక ఈ బిల్లు ప్రవేశ పెడ్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఎస్‌. బాలకృష్ణన్‌ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగంలోని 239 ఈ అధికరణం ప్రకారం దిల్లీకి విశిష్ట స్థానం దక్కింది. ఈ అధికరణాన్ని 1991లో రాజ్యాంగ 69వ సవరణద్వారా చేర్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం దిల్లీ ప్రభుత్వానికి ఉన్నతోద్యోగుల మీద ఎలాంటి నియంత్రణా ఉండదు. అంటే కేంద్ర ప్రభుత్వం తమ అడుగులకు మడుగులొత్తే అధికారులను నియమించ గలుగుతుంది. అనేక ముఖ్యమైన అంశాలలో లెఫ్టినెంట్‌ గవర్నరుకే సర్వాధికారాలు ఉంటాయి. అంటే దిల్లీకి శాసనసభ, మంత్రివర్గం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వానికి ఏ అధికారమూ లేకుండా చేసి అధికారంలో ఏ పార్టీ ఉన్నా తామే పెత్తనం చెలాయించాలన్నది మోదీ సర్కార్‌ ఎత్తుగడ. తద్వారా దిల్లీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలులోని 41వ అంశం ప్రకారం రాష్ట్ర ఉన్నతోద్యోగులు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ దిల్లీ ప్రభుత్వ అధీనంలో ఉండాలి. ఈ బిల్లు ద్వారా దిల్లీ ప్రభుత్వానికి ఇక ఆ అధికారాలు ఉండవు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం నేషనల్‌ కాపిటల్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధారిటీ (ఎన్‌.సి.సి.ఎస్‌.ఎ.) ఏర్పాటు అవుతుంది. అధికారుల నియామకం కోసం ఈ వ్యవస్థే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కు ఎవరిని ఉన్నతాధికారులుగా నియమించాలో సిఫార్సు చేస్తుంది. ఈ వ్యవస్థకు ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు కాని లెఫ్టినెంట్‌ గవర్నరుకు సిఫార్సు చేస్తే ఆయన అంతిమ నిర్ణయం తీసుకుంటారు. అంటే సకల నియామకాలు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతాయి. ముఖ్యమంత్రి నామమాత్రావశిష్టంగా మిగిలిపోతారు. ఈ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులే ఎక్కువ మంది ఉంటారు కనక ముఖ్యమంత్రి మాట చెల్లకపోవచ్చు. కేంద్ర అధికారులు ముఖ్యమంత్రి సిఫార్సులను తోసిపుచ్చవచ్చు. ఎన్‌.సి.సి.ఎస్‌.ఎ. లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నిర్ణయమే అమలవుతుంది. తాజా బిల్లు ప్రకారం అనేక విషయాలలో లెఫ్టినెంట్‌ గవర్నరుకు విచక్షణాధికారాలు ఉంటాయి. ఆఖరి మాట లెఫ్టినెంట్‌ గవర్నర్‌దే కనక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని కట్టడి చేయవచ్చు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఆ విభాగాల మంత్రులతో నిమిత్తం లేకుండా లెఫ్టినెంట్‌ గవర్నరుకు నేరుగా నివేదించవచ్చు.
ఉన్నతాధికారుల నియామకంలో దిల్లీ ప్రభుత్వానికి ప్రమేయం లేకుండా చేయడం అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడమే. ఉన్నతాధికారులను నియంత్రించే అవకాశం లేనప్పుడు దిల్లీ ప్రభుత్వం తన పరిధిలో ఏ పథకాన్ని అయినా అమలుచేయడం అసాధ్యం అవుతుంది. మంత్రివర్గాలు ఎక్కడైనా శాసనసభకు జవాబుదారుగా ఉండాలి. మే లో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులోనూ ఈ విషయమే స్పష్టం చేశారు. కానీ ఈ బిల్లు జవాబుదారీతనాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి ఉప కరిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తరవాత తీసుకొచ్చిన ఆర్డినెన్సులో లేని కొత్త అంశాలను ఈ బిల్లులో చేర్చారు. దానివల్ల దిల్లీ ప్రభుత్వం శక్తిహీనం అవుతుంది. దిల్లీ జల్‌ బోర్డు లాంటివాటికి అధికారులను నియమించడం లోనూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మాటే చెల్లుతుంది. ఈ బిల్లు చట్టం అయితే దిల్లీ ప్రభుత్వం సలహా మండలి స్థాయికి దిగజారుతుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కూడా ఉన్నతాధికారులు సవాలు చేయవచ్చు. గత రెండు దశాబ్దాల కన్నా ఎక్కువ కాలం నుంచి దిల్లీ శాసనసభ ఎన్నికలలో గెలవని బీజేపీ ప్రభుత్వం పరోక్షంగా దిల్లీపై పెత్తనం కొనసాగించడానికి వేసిన ఎత్తుగడే ఈ బిల్లు అని స్పష్టం అవుతూనే ఉంది. దిల్లీ కేంద్ర పాలిత ప్రాంత స్థాయికి దిగజారుతుంది. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నా, ఆమ్‌ ఆద్మీ పార్టీ అన్నా బీజేపీకి, మోదీ సర్కారుకు కిట్టకపోవచ్చు కానీ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ప్రభుత్వం బస్తీ దవాఖానాలు, మంచినీటిసరఫరా, విద్యుత్‌ సరఫరా విషయంలో తీసుకున్న చర్యలు జనాదరణ పొందాయి. ఇదే కేంద్ర ప్రభుత్వానికి కంటగింపుగా ఉంది. మోదీ సర్కారు ప్రతిపాదించిన బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోఉన్న వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌, బిజూ జనతాదళ్‌ మద్దతు ఇస్తున్నాయి. ఈ రెండుపార్టీలతో ఏ రాష్ట్రంలోనూ అధికారంలోలేని తెలుగుదేశంకూడా బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలని నిర్ణయించింది. ఈ మూడు పార్టీల నిర్ణయం ఎంత మాత్రం ఆశ్చర్యం కలిగించేది కాదు. అవి పేరుకు మాత్రమే బీజేపీయేతర పార్టీలు తప్ప ప్రతిపక్షపార్టీలు కావు. గతంలో మోదీసర్కారు తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక చర్యలను ఈ పార్టీలు పార్లమెంటులో సమర్థించాయి. ఇలాంటి పార్టీల మద్దతుతో ఈ బిల్లు రాజ్యసభలో కూడా గట్టెక్కవచ్చు. లోకసభలో బీజేపీకి ఉన్న తిరుగులేని మెజారిటీని ప్రజావ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, న్యాయవ్యవస్థ ధిక్కారానికి ఏహ్యమైన రీతిలో వినియోగించుకుంటోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img