Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

మోదీ పాలనలో కలానికి సంకెళ్లు

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కలానికి సంకెళ్లు వేసింది. ఇందిరా గాంధీ హయాంలో 1975లో ప్రకటిత ఎమర్జెన్సీ అమలు కాగా నేడు మోదీ పాలనలో అదే రీతిలో ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్రం అప్రకటిత ఎమర్జెన్సీని అమలుచేస్తూ మీడియా మీద, పౌర సంస్థల మీద ఉక్కుపాదం మోపుతున్నది. స్వేచ్ఛ లేని బతుకు అర్థరహితం, దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అత్యంత విచారకరం. తమకు నచ్చని జర్నలిస్టులను తొలగించవలసిందిగా యాజమాన్యాలపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నదని, ప్రభుత్వ వాణిజ్య ప్రకటనలను నిలిపివేస్తున్నదన్న విమర్శలు బాగావున్నాయి. ఈ విమర్శలు నూటికి నూరుశాతం వాస్తవమే. మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దేశంలో పత్రికా స్వేచ్ఛ మంటగలిసిందని అంతర్జాతీయ ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐపీఐ) బుధవారం చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దంపడుతున్నాయి. జర్నలిస్టులపై హింస, వేధింపులు, దాడులు, బెదిరిం పులు పెచ్చుపెరిగిపోయాయని ఐపీఐ ఆందోళన వ్యక్తంచేసింది. భారత జర్నలిస్టులపై పెగాసెస్‌ దాడిని ఐపీఐ గుర్తు చేసింది. జర్నలిస్టుల ఫోన్లు హాక్‌ చేసి వారి గోప్యతా హక్కుకు భంగం కలిగించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ సంయుక్తంగా ఆధారాలను బయటపెట్టాయని తెలిపింది. జర్నలిస్టులపై దాడుల మీద ఇంప్యూనిటీ సూచీ`2023లో 12వ వరస్ట్‌ దేశంగా భారత్‌ నిలిచిందని గుర్తుచేసింది. పాత్రికేయులకు రక్షణ కల్పించడంలో గత రెండు పాలనా కాలాల్లోనూ విఫలమైన మోదీ ప్రభుత్వం కనీసం ఈసారైనా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రాధాన్యతివ్వాలని కోరింది. జర్నలిస్టులపై దాడులు, హత్యల కేసుల్లో విచారణను సమగ్రంగా, విశ్వస నీయంగా, పారదర్శకంగా జరిపించాలని విజ్ఞప్తి చేసింది. పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే తప్ప మరొకటి కాదనడంలో ఎటువంటి సందేహంలేదు. చరిత్రలో మీడియా స్వేఛ్ఛ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆనాడు లితో ప్రెస్‌ ద్వారా పత్రికలు వెలువడేవి. అదికూడా ప్రతి రోజూ పత్రికలు వచ్చేవికావు. అలాగే కరపత్రాలు, తదితరాల ద్వారా కూడా సమాచారాన్ని అందించేవారు. పశ్చిమ ఐరోపాలో ప్రత్యేకించి ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాలలో 17, 18వ శతాబ్దాలలో ఫ్యూడలిస్టుల అణచివేతకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు మీడియా ఒక ఆయుధంగా ఉపయోగపడిరది. ఆ కాలంలో అధికార విభాగాలన్నీ రాజులు, ప్రభువులు తదితర ఫ్యూడల్‌ పాలకుల చేతుల్లోనే ఉండేవి… అందువల్ల ప్రజలు కొత్త ఆయుధా లను తయారు చేసుకోవల సివచ్చింది. ఆయుధాలు ప్రజల ప్రయోజనాల ప్రతినిధులుగా ఉండాలి. అందువల్లనే ప్రజలు మీడియాను తమకు శక్తివంతమైన ఆయుధాలుగా తయారు చేసుకున్నారు. ప్రజల భవిష్యత్తు వాణిగా మీడియా రూపొందింది. ఫ్యూడల్‌ పాలకుల చేతుల్లో ఆయుధాలుగా మాత్రమే కాదు… ఇప్పుడు కూడా మనం అలాంటి పరిస్థితిని కల్పించుకోవాలి. ఫ్యూడల్‌ ఐరోపాను ఆధునిక ఐరోపాగా మార్పు చేసేందుకు అప్పట్లో మీడియా గొప్పగా ఉపయోగపడిరది. మన దేశంలో రాజారామ్మోహనరాయ్‌, గణేశ్‌ శంకర్‌ విద్యార్థి, నిఖిల్‌ చక్రవర్తి, అరుణ అసఫాలీ తదితర అనేక గొప్ప జర్నలిస్టులు ఉండేవారు. వాళ్లు ఒంటరిగానే సమాజంలో నెలకొన్న దురాచారాలు, రుగ్మతలు, రైతుల ఆత్మహత్యలులాంటి సమస్యలను ప్రముఖంగా సమాజం దృష్టికి తీసుకువెళ్లేవారు. మరికొంతమంది ఇలాంటి వాటిని విస్మరించారు. అలాగే నిరంతరం మతోన్మాదాన్ని వ్యతిరేకించే జర్నలిస్టులు కూడా ఉన్నారు. అయితే అలాంటివాళ్లు అనేక కష్టాలపాలయ్యారు. ఉపా చట్టం కింద అనేక మంది జర్నలిస్టులను జైళ్లకు పరిమితం చేశారు. మోదీ పాలనలో మీడియా స్వేచ్ఛ గణనీయంగా క్షీణించింది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ చర్యలను ఏడాది క్రితమే సిఫార్సు చేసినప్పటికీ ఆ దిశగా పురోగతి శూన్యం అని ఐపీఐ ఆందోళన వ్యక్తంచేసింది. పై పెచ్చు జర్నలిస్టులపై ఉపా చట్టం, ఐటీ చట్టం వంటివాటివి అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. బీజేపీని విమర్శించే మీడియా సంస్థలు, జర్నలిస్టులను న్యాయ చిక్కుల్లో పడవేస్తున్నారు. జర్నలిస్టులను బెదిరించే పరంపర కొనసాగితే ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టింగ్‌ దెబ్బతింటుంది.
వాస్తవ సమస్యలను నుంచి ప్రజల దృష్టిని మరిలించే విధంగా మీడియాను మోదీ ప్రభుత్వం లొంగదీసుకుంటోంది. సామాజిక, ఆర్థిక సమస్యలు, పేదరికం, నిరుద్యోగం, పిల్లల్లో పౌష్టికాహార లోపం రైతాంగం వెతలు, ఆరోగ్యభద్రత, నాణ్యమైన విద్య తదితర సమస్యలు అత్యధిక మీడియాలో కనిపించడంలేదు. ష్యాషన్‌ పెరేడ్‌లు, క్రికెట్‌లాంటి వాటికి విశేష ప్రాధాన్యతనిస్తున్నారు. దేశంలో మీడియా స్వేచ్ఛ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలి. ప్రజల సంక్షేమం కోసం మీడియా స్వేచ్ఛకు ఇబ్బందులు కలిగించకూడదు. మీడియా స్వేఛ్ఛ అంటే యాజమాన్యాలకు స్వేఛ్చ కాదు. మీడియా స్వేచ్ఛ అనేది ప్రజాసంక్షేమానికి ఉపయోగ పడాలి. మీడియా స్వేచ్ఛవల్ల అంతిమంగా సమాజానికి ప్రయోజనం కలగాలి. మీడియా స్వేచ్ఛ సమాజానికి ప్రయోజనం కలిగిస్తే అది ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు, గౌరవనీయమైన జీవితాన్ని, సామాజిక భద్రతను కల్పించేందుకు, ప్రజలు సంతోషంగా పురోగతిని సాధించేందుకు దోహదంచేస్తుంది. అందుకు విరుద్ధంగా యాజమాన్యానికి మాత్రమే స్వేచ్ఛ ఉంటే ఎందుకూ పనికిరాదు. ఐరోపాలో మీడియా నిర్వహించిన పాత్రను ఇక్కడ కూడా నిర్వహించాలి. పత్రికా స్వేచ్ఛ ద్వారానే ప్రజాస్వామ్యం సమర్థంగా పనిచేయగలదని మోదీ ప్రభుత్వం తెలుసుకోవాలి. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వాతంత్య్రంపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికి జర్నలిస్టులంతా సమైక్య పోరాటం సాగించాల్సిన అవసరం ఎంతైనావుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img