Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

స్వయం విధ్వంసక శక్తి

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ మీద జరిగిన దాడి హేయమైంది. ఈ దాడిలో నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో కానీ తేలవు. సోమవారం దాడి జరిగిందంటున్న వెంటనే స్వాతి మలివాల్‌ పోలీసు స్టేషన్‌కు అయితే వెళ్లారు కానీ అప్పుడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. ఆ తరవాత మాత్రమే ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు అయింది. స్వాతి మలివాల్‌ను ముఖ్యమంత్రిని కలవడానికి ఎందుకు అనుమతించలేదో అంతుపట్టదు. ఆ తరవాత కేజ్రీవాల్‌ ఉత్తరప్రదేశ్‌ వెళ్లి అక్కడ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సహజంగానే విలేెకరులు స్వాతి మలివాల్‌ గురించి కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. కానీ కేజ్రీవాల్‌ సమాధానం ఇవ్వకపోవడానికి కారణం తెలియదు. ఏమైతేనేం రాజకీయాలలో కాస్త ఎక్కువ అనుభవం గడిరచిన అఖిలేశ్‌ యాదవ్‌ చాకచక్యంగా కేజ్రీవాల్‌ను విలేకరుల ప్రశ్నల వర్షం నుంచి కాపాడగలిగారు. స్వాతి మలివాల్‌ మీద దాడి చేశాడంటున్న విభవ్‌ కుమార్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై ఇప్పటికి ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు కాలేదు. స్వాతి మలివాల్‌ తన మీద విభవ్‌ కుమార్‌ దాడి చేశారని ఆరోపించిన వెంటనే కేజ్రీవాల్‌ ఆయనను తొలగించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఆయన ఏ తప్పు చేయకుండా ఉంటే దర్యాప్తు తరవాత నిర్దోషిగా బయట పడేవారు కదా. స్వాతి మలివాల్‌ ఫిర్యాదు అందిన తరవాత సహజంగానే పోలీసులు విభవ్‌ కుమార్‌ కోసం వెదకడం ప్రారంభించారు. ఆయన పంజాబ్‌ లో ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్‌ వెళ్లారు. అంటే ఆయన వెంట విభవ్‌ కుమార్‌ ఉన్నారను కున్నారేమో. దిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు తాత్కాలికంగా జూన్‌ ఒకటవ తేదీ దాకా విడుదల చేసింది. జూన్‌ రెండున ఆయన జైలు అధికారులకు లొంగి పోవలసి ఉంది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు తాత్కాలికంగా ఎన్నికల ప్రచారానికి వెసులుబాటు కల్పించిందే తప్ప బెయిలు మంజూరు చేయలేదు. అలాంటి స్థితిలో కేజ్రీవాల్‌ అజాగ్రత్తగా వ్యవహరించడం విచిత్రమే. కేజ్రీవాల్‌ రాజకీయాలకు మరీ కొత్తేమీ కాదు. 2015 నుంచి దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జాగ్రత్తగా మసులుకోగలిగే అనుభవం గడిరచి ఉండాల్సింది. అదీ లేదు. జాతీయ మహిళా కమిషన్‌ కేజ్రీవాల్‌ ఒక నిందితుడికి ఆశ్రయం ఇస్తున్నారని అంటోంది. ఈ ఆరోపణలు రాకుండా చూసుకోవడానికి కేజ్రీవాల్‌ ఏ ప్రయత్నమూ చేసినట్టు లేదు. కేజ్రీవాల్‌ మంత్రివర్గ సభ్యురాలు ఆతిషి కేజ్రీవాల్‌ను వెనకేసుకురావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె స్వాతి మలివాల్‌ పాత కథలు తవ్వి అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. చివరకు పోలీసులు విభవ్‌ను కేజ్రీవాల్‌ ఇంట్లో నుంచే అరెస్టు చేశారు. దీన్నిబట్టి విభవ్‌ ముఖ్యమంత్రితో పాటు పంజాబ్‌ వెళ్లలేదనుకోవచ్చు. విభవ్‌ ముఖ్యమంత్రి ఇంట్లో దాగి ఉండడం కచ్చితంగా కేజ్రీవాల్‌కు అదనపు ఇబ్బందులు తెచ్చి పెట్టే అంశమే.
స్వాతి మలివాల్‌ వ్యవహారం వెనక బీజేపీ కుట్ర ఉందని ఆతిషి ఆరోపిస్తున్నారు. అది వాస్తవమే కావచ్చు. దేశమంతటా మోదీ నాయకత్వంలోని బీజేపీ ‘‘వెలిగిపోతోంది’’ అన్న తరుణంలో దిల్లీలో బీజేపీ ప్రభుత్వం లేకపోవడం కచ్చితంగా బీజేపీకి కంటగింపుగానే ఉంటుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సహాయంతో కేజ్రీవాల్‌కు ఎన్ని ఇబ్బందులు కలగజేయడానికి అవకాశం ఉందో అన్నీ బీజేపీ కలగజేస్తూనే ఉంది. ప్రాంతీయంగా పట్టున్న పార్టీలను విచ్ఛిన్నం చేయడాన్ని బీజేపీ పనిగా పెట్టుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీని అలాగే విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యులను తమ వేపు తిప్పుకోవడానికి బీజేపీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు కోట్లాది రూపాయలు ముట్ట చెప్పడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలున్నాయి. దీంట్లో నిజానిజాలు ఏమిటో తెలిసే అవకాశం తక్కువ. ఎందుకంటే తెరచాటు వ్యవహారాలకు రుజువులు ఉండకపోవచ్చు. మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌.సి.పి.)ని, ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేనను బీజేపీ ముక్కలు చేసిన వైనం కళ్లెదుట ఉండగా కేజ్రీవాల్‌ అప్రమత్తంగా ఉండకపోవడం వైపరీత్యమే. దిల్లీ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పని చేయరు. వారు నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అదుపాజ్ఞల్లో ఉంటారు. ఈ విషయం కేజ్రీవాల్‌కు తెలిసినా అజాగ్రత్తగా ఉండడం అంటే ఆమ్‌ ఆద్మీ పార్టీని చీల్చే అవకాశం ఇవ్వడమే. దిల్లీ మద్యం కేసులో ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పీకల దాకా మునిగిపోయి ఉంది. కేజ్రీవాల్‌కు కుడి భుజం అనుకున్న ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా 2023 ఫిబ్రవరి నుంచి నిర్బంధంలోనే ఉన్నారు. బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలకు నిరంతరం అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన నిర్బంధాన్ని ఈ నెల 30వ దాకా పొడిగించారు. సత్యేంద్ర జైన్‌ ఇప్పటికీ ఊచలు లెక్క పెడ్తూనే ఉన్నారు. ఆ తరవాత ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ ఆరు నెలలకు పైగా జైలులో గడిపిన తరవాత కానీ బెయిలు దక్కలేదు. దిల్లీ మద్యం కేసును ఆసరాగా చేసుకుని ఆమ్‌ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టడానికి మోదీ ప్రభుత్వం సకల ప్రయత్నాలూ చేస్తోంది. రాజ్యసభలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘవ్‌ ఛడ్డా ఇటీవలే కంటి చికిత్సకోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు కాబట్టి సరిపోయింది. ఎన్నికల ప్రచారం చేయడానికి అనువుగా సుప్రీంకోర్టు కల్పించిన ఉపశమనాన్ని సద్వినియోగం చేసుకుని దిల్లీ, పంజాబ్‌లో ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన అభర్థులను గెలిపించే రీతిలో ప్రచారం కొనసాగించకుండా తన చుట్టే ఉచ్చు బిగించుకునే అపార ‘‘నైపుణ్యాన్ని’’ కేజ్రీవాల్‌ ప్రదర్శిస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని ఛిద్రం చేయడానికి బీజేపీ పన్నుతున్న కుట్రలను భగ్నంచేసే ఉపాయాలు ఆలోచించకుండా, స్వాతి మలివాల్‌ మీద దాడి చేశాడంటున్న తన సహాయకుడి మీద చర్య తీసుకోకుండా వదిలేసి దారీ తెన్ను తోచనివాడిలా ప్రవర్తిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) వ్యవహార సరళిపై సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. ఈ సానుకూల వాతావరణాన్ని వినియోగించుకోవడంలో కేజ్రీవాల్‌ దారుణంగా విఫలమవుతున్నారు. కేవలం బీజేపీని శాపనార్థాలు పెట్టడం ద్వారా ఆ పార్టీ కుతంత్రాలను ఎదుర్కోవడం అసాధ్యం. కేజ్రీవాల్‌ భస్మాసురుడిలా తయారవుతున్నట్టున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img