Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

14 శాతం ఫీజు తో నాన్ లేఅవుట్ స్థలాల్లో బిల్డింగ్ ప్లాన్….

మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్….
విశాలాంధ్ర-తాడేపల్లిగూడెం: భూమి మార్కెట్ విలువపై 14 శాతం ఫీజు కడితే నాన్ లేఔట్ స్థలాలలో ఇల్లు కట్టుకునే వారికి బిల్డింగ్ ప్లాన్ ఇస్తామని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ వెల్లడించారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. పట్టణ జనాభా రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా అభివృద్ధి పరంగా ముందంజలో ఉండవలసిన అవసరం ఉందన్నారు. గత 11 సంవత్సరాలుగా 60 లేఔట్లు జరిగాయన్నారు. ఇవి కాకుండా అనేక నాన్ లేఅవుట్లు వచ్చాయన్నారు. రియల్టర్లు వెంచర్లు వేసి ప్లాట్లు విడగొట్టి అమ్ముకుని చేతులు దులిపేసుకుంటున్నారని తెలిపారు. ఆ తర్వాత ఆ స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలనుకునేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ శామ్యూల్ చెప్పారు. నాన్ లేఅవుట్ లో ప్లాన్ రాదనే ఉద్దేశంతో ఎటువంటి ప్లాన్ తీసుకోకుండా అనధికారకంగా బిల్డింగులు కట్టినట్లు, కడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎటువంటి ప్లాను తీసుకోకుండా ఇల్లు కట్టుకున్న వారు ఆ తర్వాత చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై అవసరమైతే చార్జిషీట్ వరకు కూడా వెళతామని కమిషనర్ శామ్యూల్ హెచ్చరించారు. కాబట్టి నాన్ లేఔట్ లో అయినా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు ముందుగానే ప్లాన్ పెట్టుకుని అనుమతి తీసుకుని ఇల్లు కట్టుకోవాలని ఆయన సూచించారు. అయితే ఇలాంటి వారు తమ భూమి మార్కెట్ విలువపై 14 శాతం ఫీజు మున్సిపాలిటీకి చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అలా చెల్లించిన వారికి నిబంధనల ప్రకారం బిల్డింగ్ ప్లాన్ ఇస్తామని కమిషనర్ తెలియజేశారు. రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్లకు సంబంధించి కూడా పరిశీలన చేపట్టామన్నారు. రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ కట్టడాలు కడుతున్నారని అలాంటి వారికి నోటీసులు జారీ చేసి వాటిని క్రమబద్ధీకరించి ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ప్లాన్ తీసుకుని ఇల్లు కట్టుకున్న వారు ప్లాన్ ప్రకారం కట్టారా లేదా ఏమైనా ఉల్లంఘించారా అనేది కూడా పరిశీలిస్తామని తెలిపారు. పరిమితికి లోబడి ఉల్లంఘనాలు ఉంటే అనుమతిస్తామని దానికి మించి ఉంటే మాత్రం అలాంటి వాటిని కూడా క్రమబద్ధీకరించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అపార్ట్మెంట్లలో ప్లాట్ కొనుక్కుని అందులోకి వెళ్ళేటప్పుడు యజమాని ఆక్యుపేషన్ సర్టిఫికెట్ మునిసిపాలిటీ నుంచి పొందడం తప్పనిసరి అని సూచించారు. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతరకర ధ్రువీకరణ పత్రంతో పాటు అపార్ట్మెంట్ కు డ్రైనేజీ, నీటి సదుపాయం ఉన్నాయో లేదో పరిశీలించి తమ సిబ్బంది ధ్రువీకరిస్తారన్నారు. ఇటీవల తాను ఒక అపార్ట్మెంట్ కి వెళ్లి చూసినప్పుడు అక్కడ డ్రైనేజీ సదుపాయం లేదన్నారు. మరి అలాంటప్పుడు ఆ అపార్ట్మెంట్ ప్లాట్ లలో ఉన్నవారు వాడుకునే మురుగునీరు ఎక్కడకు వెళుతుందనేది ప్రశ్నార్ధకమవుతుందన్నారు. కాబట్టి ఇవన్నీ ముందుగానే పరిశీలించి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. బిల్డర్లు, ప్లాట్ యజమానులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. లైసెన్స్ సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్లాన్ పెట్టాలని లేకపోతే తిరస్కరిస్తామన్నారు. యజమానులు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత లైసెన్స్ సర్వేర్ల పై ఉందని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ స్పష్టం చేశారు. ఈయనతో పాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కే.హరిప్రసాద్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img