Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు

క్రీడలు యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శి వాణిమోహన్…

విశాలాంధ్ర : రాష్ట్రంలో అక్టోబర్, 2వ తేదీ నుండి నవంబర్ 8వ తేదీ వరకు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట వివిధ క్రీడా విభాగాలలో పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపుల్ కార్యదర్శి జి. వాణిమోహన్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, వివిధ జిల్లా స్థాయి అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వాణిమోహన్ మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం పెంపొందుతుందన్నారు. రాష్ట్ర ప్రజలలో ఆనందం, ఆరోగ్యం పెంపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్టోబర్, 2వ తేదీ నుండి ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట వివిధ క్రీడా విభాగాలలో గ్రామ స్థాయి నుండి, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో క్రికెట్, వాలీబాల్, బాడ్మింటన్ , కోకో, కబాడ్డీ, విభాగాలలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, అంతేకాక స్థానిక సాంప్రదాయ క్రీడలలో కూడా పోటీలు నిర్వహించవచ్చన్నారు.పోటీల నిర్వహణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించుకుని పటిష్టంగా క్రీడలు నిర్వహించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకొక్క జిల్లాలో దాదాపు 3 లక్షల వరకు పోటీలు నిర్వహించే అవకాశం ఉన్నందున, క్రీడా మైదానాలు గుర్తించడం, క్రీడల పోటీలు, క్రీడాకారులకు భోజన, వసతి, రవాణా, పోటీలు నిర్వహించే ప్రదేశం, తదితర అంశాలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబర్, 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడల పోటీలను ప్రారంభిస్తారని, నవంబర్, 8వ తేదీన విశాఖపట్నం లో ముగింపు సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరుగుతుందన్నారు.క్రీడా పోటీలలో జిల్లాలోని వివిధ క్రీడా విభాగాలలో ఒలింపిక్, అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించిన వారిని,స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. ప్రతీ జిల్లాలోను బ్రాండ్ అంబాసిడర్లుగా ఆయా జిల్లాలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన వారిని నియమించడం జరిగిందన్నారు. క్రీడల నిర్వహణకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద జిల్లాలోని పారిశ్రామిక సంస్థల సహకారంతో టీ షర్ట్స్ , కాప్స్ వంటి వాటితోపాటు క్రీడా మైదానాలలో మౌలిక సదుపాయాలు అందేలా చూడాలన్నారు. క్రీడాపోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఈనెల 25వ తేదీ నుండి ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు.ప్రజలందరూ ఈ క్రీడా పోటీలలో పాల్గొనేలా చూడాలని, క్రీడలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాణీమోహన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. క్రీడాపోటీలు రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో జరగాలని ముఖ్యమంత్రి ఆలోచనని, పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిందని వాణిమోహన్ చెప్పారు.జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలు నిర్వహణకు గ్రామ స్థాయి నుండి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఇప్పటికే క్రీడా మైదానాలను గుర్తించామని,, మండల ప్రత్యేక అధికారులను గ్రామ, మండల స్థాయిలలో క్రీడల నిర్వహణకు బాధ్యత అప్పగించడమైందన్నారు.కోచ్ లు, వ్యాయమ ఉపాధ్యాయులను సిద్ధం చేశామన్నారు. జిల్లాలో క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్ గా హ్యాండ్ బాల్ లో ఒలింపిక్ విజేత మాధవిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు.జిల్లాలో క్రీడల నిర్వహణకు జిల్లా జాయింట్ కలెక్టర్ ను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. జిల్లా అధికారులకు వ్యాయాయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేందుకు ఏలూరులోని ఆఫీసర్స్ క్లబ్ నందు ప్రత్యేక జిమ్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలలో జిల్లా అధికారులకు కూడా ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందింస్తామని కలెక్టర్ చెప్పారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, డిఆర్ఓ ఏ .వి. ఎన్ . ఎస్. మూర్తి, ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ, సెట్ వెల్ సీఈఓ మెహ్రరాజ్ , మునిసిపల్ కమీషనర్ ఎస్. వెంకట్ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. డి. ఆశా ,జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, వివిధ శాఖల అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img