Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వైద్యుల నిర్లక్ష్యం – అంబులెన్స్ లోనే ప్రసవం

విశాలాంధ్ర – బుట్టాయిగూడెం: వైద్యుల నిర్లక్ష్యంతో అంబులెన్స్ లొనే ప్రసవం జరిగిన సంఘటన ఏజెన్సీ మండలం బుట్టాయిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది . ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మండల నాయకులు టీ బాబురావు, న్యాయవాది శ్యాంబాబులు వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుట్టాయిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు మెరుగైన వైద్యం అందించాలని, ప్రధాన వైద్యులు సమయానికి ప్రజలకు అందుబాటులో ఉండాలని వారు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం తూర్పు రేగులగుంట గ్రామానికి చెందిన కుంజా బాలకృష్ణ భార్య కుంజ సావిత్రికి ఉదయం గం.5:30లకు పురిటి నొప్పులు మొదలు కావడంతో బుట్టాయిగూడెం ఏరియా ఆసుపత్రికి ఫోన్ చేసినా భార్యకు పురిటినొప్పులు వస్తున్నాయి అంబులెన్స్ పంపించమని కోరగా అంబులెన్స్ లేదని సిబ్బంది సమాధానం చెప్పారు. దాంతో వెంటనే అతను ఒక కారు మాట్లాడుకుని బుట్టాయగూడెం ఆసుపత్రికి తీసుకువచ్చాడు ఆన్ డ్యూటీ లో ఉన్న డాక్టరు, గైనకాలజిస్ట్, స్టాఫ్ నర్స్, ఇద్దరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయటం కుదరదని మీరు జంగారెడ్డిగూడెంలో ఆస్పత్రికి తీసుకెళ్ళమని చెప్పి కనీసం పేషెంట్ ని చూడకుండా ఆర్డర్ జారీ చేయడంతో, భయంతో గర్భిణీ భర్త, మామ అంబులెన్స్ మీద జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి బయలుదేరారు. జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గమధ్యంలో పెద్దపెద్ద గోతులు ఉండటంతో కృష్ణాపురం దాటిన తర్వాత బేబీ సగం బయటకు రావడంతో అంబులెన్స్ సిబ్బంది అబులెన్స్ ను పక్కగా ఆపి ఆమెకు పురుడు పోశారు. తదుపరి తల్లిని బిడ్డను బుట్టాయిగూడెంఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇదంతా డ్యూటీలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగింది అనివారు ఆవేదన వ్యక్తంచేశారు. మార్గమధ్యంలో డెలివరీ సమయంలో తల్లికి, బిడ్డకు గాని ఏ విధమైన హాని జరిగినా సిబ్బంది బాధ్యత వహిస్తారా అని వారి నిర్లక్ష్యానికి ప్రభుత్వం, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ, అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా వ్యవహరించిన వారిని తక్షణమే విధుల నుంచి తప్పించాలని న్యూ డెమోక్రసీపార్టీ డిమాండ్ చేస్తుంది అని తెలిపారు. బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ మండలాల్లో పెద్ద మండలం ఆదివాసీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం, జ్వరాలకు, డెలివరీలకు, పాము కాటుకు గురైన వారు ఎక్కువగా ఈ ఆసుపత్రికి వస్తారు. కానీ ఆసుపత్రి సిబ్బంది సమయానికి అందుబాటులో ఉండటం లేదు. వచ్చినా రోగులను పరీక్షించకుండా జంగారెడ్డిగూడెం, ఏలూరు రిఫర్ చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని స్పష్టంచేశారు. ఈ క్రమంలో రోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బుట్టాయిగూడెం ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ను తక్షణమే ఏర్పాటు చేయాలని, డెలివరీలను రిఫర్ చేయకుండా ఇదే ఆసుపత్రిలో నిర్వహించాలని, సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి కాబట్టి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విష జ్వరాలకు ఇక్కడే పరీక్షల నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని, మెరుగైన మందులను అందించాలనివారు కోరారు. ఈ ఆసుపత్రి సూపర్నెంట్ కిషోర్ నాయక్ విధులు సరిగా నిర్వర్తించడం లేదు, విధులకు హాజరు కావడం లేదు, ఆయన పైన శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img