Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అభివృద్దే ఎజెండాగా టిడిపి,జనసేన, బిజెపి

తేదేపా ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ

విశాలాంధ్ర – ఏలూరు: అభివృద్దే ఎజెండాగా టిడిపి, జనసేన, బిజెపి కూటమి పనిచేస్తుందని
తేదేపా ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ తెలిపారు. బుధవారం స్థానిక మూడవ డివిజన్ లో బాబు షూరిటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాలా బాలాజీ మాట్లాడుతూ
గడచిన అయిదేళ్లలో దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం కొన్ని
దశాబ్దాలు అభివృద్ధిలో వెనుకబడిపోయిందని విమర్శించారు.
ఏడాదిలో 341 రోజులు ఏపి అప్పులు చేస్తూనే ఉన్నదని, సగం రోజులకు పైగా ఓవర్ డ్రాఫ్ట్
లపై ఆధారపడుతోందని కాగ్ నివేదికలు చెబుతున్నాయన్నారు.గడచిన అయిదేళ్లలో దాదాపు రూ.10 లక్షల కోట్ల మేరకు రుణాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయితీ నిధులు, ఎస్ సి, ఎస్ టి, సబ్ ప్లాన్ నిధులను కూడా మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇస్తున్న రాయితీలు, సబ్సిడీలు ప్రజలకు చేరడం లేదన్నారు.
వివిధ సంక్షేమ పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేయకపోవడంతో అవి నత్తనడక నడుస్తున్నాయని విమర్శించారు. జగన్నొక్కుతున్న బటన్ల ద్వారా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేయడం తప్ప జగన్ ఈ అయిదేళ్లలో అభివృద్ధి శూన్యం అన్నారు. జనాభాపరంగా రాష్ట్రాన్ని శాసించాల్సిన స్థాయిలో ఉండాల్సిన బడుగు, బలహీన, సామాజిక వర్గాలు జగన్ పాలనలో అష్ట కష్టాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గత ఎన్నికల సందర్భంగా అధికారమే లక్ష్యంతో ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అరచేతిలో స్వర్గం చూపించారని ఎద్దేవా చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే అన్యాయంగా దౌర్జన్యాలు, పోలీసుల కేసులు రాష్ట్రంలో నిత్యకృత్యం అయ్యాయని ఆరోపించారు. కుల వృత్తులు, చేతివృత్తులను ప్రోత్సహించాల్సింది పోయి వ్యవస్థలను నిర్వీర్యం చేసి సామాన్య ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నవ శకానికి నాంది పలకడం కోసం ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోన్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img