Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీలు…

సత్వరమే రైతులకు ట్రాన్స్ఫార్మర్లు చేయాలని ఉన్నతాధికారులనుకోరిన చింతమనేని ప్రభాకర్….

విశాలాంధ్ర -పెదవేగి: అటు ప్రభుత్వం, ఇటు విద్యుత్, పోలీస్ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల రైతులు ఎన్నో అవస్థల పాలవుతున్నారని, తక్షణమే సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.
పెదవేగి మండలం దుగ్గిరాలలోని కార్యాలయంలో శనివారంనాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు, అభిమానులు చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు రైతులు చింతమనేని ప్రభాకర్ ని కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఇటీవల తమ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ఎత్తు కెళ్ళారని, వాటిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్. ఐ.అర్ కాపీలను విద్యుత్ శాఖ అధికారులకు అందించి రోజులు గడుస్తున్నా, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకుండా ఫైల్ అక్కడుంది, ఇక్కడుంది అంటూ తాత్సారం చేస్తున్నారని పలువురు రైతులు చింతమనేని ప్రభాకర్ కు తెలిపారు. తన పొలంలో 25హెచ్ .పి.
ట్రాన్స్ఫార్మర్ పోయిందని ఫిర్యాదు చేసి నెల గడుస్తున్నా కనీసం విద్యుత్ అధికారుల్లో స్పందన లేదని కొమ్మా చింతయ్య అనే రైతు తెలిపారు.
దీంతో రైతుల సమస్యలపై తక్షణమే స్పందించిన చింతమనేని ప్రభాకర్, జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతుల పొలాల్లో దొంగలు పడి యధేచ్ఛగా ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేస్తుంటే పోలీస్ శాఖ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. పోలీస్ శాఖ నిర్లక్యం వల్ల ట్రాన్స్ఫార్మర్ల కొరత ఏర్పడి రైతులు ఇంతగా ఇబ్బందులు పడుతుంటే, ఆ ఘటనలపై పోలీస్ శాఖ వైఫల్యాలను ప్రస్తావిస్తూ విద్యుత్ శాఖ సి. ఎం.డి,రాష్ట్ర డిజిపికి లేఖ రాయాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు. విద్యుత్ శాఖా మంత్రి ఎలాగో నిద్ర పోతున్నారు, ఇటు అధికారులు కూడా ఉదాసీనత వ్యవహరిస్తే రైతుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. ఇది రైతులకు అత్యంత కీలక సమయం అని, నారుమళ్లు వేసే సమయంలో రైతులు తమ పొలాలకు ట్రాన్స్ఫార్మర్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని, సత్వరమే రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని చింతమనేని ప్రభాకర్ జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కోరారు.ఈ సందర్భంగా తమ సమస్యలపై సత్వరమే స్పందించిన చింతమనేని ప్రభాకర్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img