Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

అభివృద్ధి లేని వైసిపి పాలనకు స్వస్తి చెప్తున్నాం…

చింతమనేని నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నాం…

వైసిపిని వీడి చింతమనేని నాయకత్వంలో తెదేపాలో పలు కుటుంబాలు….

విశాలాంధ్ర -పెదవేగి: అభివృద్ధి లేకపోవటం వల్ల రాష్ట్రము అధోగతి పాలయ్యిందని, దెందులూరు నియోజకవర్గంలో సైతం జరుగుతున్న అక్రమాలు అవినీతిని చూసి సహించలేక తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి చింతమనేని ప్రభాకర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పెదవేగి మండలం చక్రాయగూడెం పంచాయితీ సీతారామపురం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు తెలిపారు.
దుగ్గిరాలలోని నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీతారామ పురం గ్రామానికి చెందిన మర్రి వాసు, మర్రి మల్లిఖార్జునరావు, మొడెడ్ల రాంబాబు, మోడెడ్ల ప్రదీప్, మిడతాని సాయి కుమార్, దాసరి శివ, మాచవరపు చంద్ర శేఖర్ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ
రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
దెందులూరులో కూటమి విజయం ఖరారు అయిపోవడంతో, ఓటమి భయంతో వైసిపి నాయకులు చేసే ఉడత ఊపులకు, అసత్య ప్రేలాపనలకు పట్టించుకునే స్థితిలో ప్రజలు ఎవ్వరూ లేరని, రాబోయే టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వంలో దెందులూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేసి తీరుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధ, కార్యదర్శి మాదు రవి, గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రెల సుధాకర్, సీనియర్ నాయకులు దొరరాజు శ్రీనివాస రాజు,కే.వి.కృష్ణా రావు, గొర్రెల నరేంద్ర, బడుగు సత్యనారాయణ, మందిడి కేశవ, పెద్దిరెడ్డి సత్యనారాయణ వెన్నెల అప్పారావు సహా పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img