Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

బీటెక్‌ విద్యార్థిని దారుణహత్య

గుంటూరులో కిరాతకం
నిందితుడి అరెస్టు
ఆసుపత్రికి హోం మంత్రి

గుంటూరు వైద్యం : స్వాతంత్య్ర దినోత్సవం రోజే బీటెక్‌ విద్యార్థిని దారుణహత్యకు గురైంది. గుంటూరుకాకాని రోడ్డు పరమాయికుంటలో ఈ దారుణం జరిగింది. బీటెక్‌ చదువుతున్న నల్లపు రమ్యను ఓ యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్‌ మూడవ సంవత్సరం చదువుతున్న

రమ్య కాకాని రోడ్డులో వెళుతోంది. అటుగా వచ్చిన ఓ యువకుడు తన బైక్‌పై ఎక్కాలని విద్యార్థినిని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో రమ్య మెడ, పొట్టభాగంలో పొడిచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న రమ్యను స్థానికులు వెంటనే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు. కాగా, నిందితుడిని గుంటూరు అర్బన్‌ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఈ విషయాన్ని డీజీపీ గౌతం సవాంగ్‌ చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పమిడిపాడు వద్ద పట్టుకున్నారని తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసును వెంటనే ఛేదించిన పోలీసులను డీజీపీ అభినందించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత హుటాహుటిన జీజీహెచ్‌కు చేరుకున్నారు. రమ్య మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం మంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే నిందితుడికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలిపారు. రమ్య హత్య దారుణం, హేయమని వ్యాఖ్యానించారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని, రమ్య ఫోన్‌ అన్‌లాక్‌ చేసిన తరువాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని తెలిపారు. రమ్య కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారిస్తామన్నారు. ఈ సంఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పారు.
జగన్‌ దిగ్భ్రాంతిరూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : విద్యార్థిని రమ్య హత్యపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలు తీసుకుని నిందితుడికి కఠినశిక్ష పడేలా చేయాలని ఆదేశించారు. ఘటన వివరాలు తెలియగానే హోంమంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని, పరిహారంగా రూ.10లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : రామకృష్ణ
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద రమ్య అనే బీటెక్‌ విద్యార్థినిని అతికిరాతకంగా హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇలాంటి దారుణం జరగడం బాధాకరమన్నారు. గతేడాది ఆగస్టు 17న కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామంలో హజీరా అనే యువతిని హత్య చేసిన దుర్మార్గుడిని ఇంతవరకు పట్టుకోలేకపోయారన్నారు. దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, రమ్యని హత్య చేసిన నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని రామకృష్ణ డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img