Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వృద్ధిరేటు పటిష్టం

6.5 నుంచి 7 శాతం… ఆర్థిక సర్వే అంచనా
నేడు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ

న్యూదిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో 6.5 నుంచి 7 శాతం వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగినా దేశీయ వృద్ధి చోదకాలు ఆర్థికానికి అండగా నిలిచాయని పేర్కొంది. దేశంలో ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌లో వృద్ధిలో ముందుకు దూసుకెళ్లనుంది తెలిపింది. అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలు, వాటి ప్రభావం ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని, ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడిరచింది. కేంద్రమంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం బడ్జెట్‌ సమర్పించనున్న వేళ సోమవారం ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. దీంతో పాటు గణాంక అనుబంధాన్ని కూడా సభ ముందుం చారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనమిక్‌ డివిజన్‌ ఈ సర్వే రూపొందిస్తుంది. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది. కార్పొరేట్‌, బ్యాంకింగ్‌ బ్యాలెన్స్‌ షీట్స్‌ బలంగా ఉన్నాయని, ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడిరది. భారత వృద్ధిలో క్యాపిటల్‌ మార్కెట్‌లది కీలకపాత్ర అని, భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోలదని ఆర్థిక సర్వే తెలిపింది. పెరిగిన చైనా ఎఫ్‌డీఐలు ప్రపంచంలో భారత సరిఫరా చైన్‌లో భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులకు ఊతమివ్వడానికి సహాయపడుతుందని, దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టిందని చెప్పుకొచ్చింది. 2022-23 నాటికి నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిందని, ఆటోమొబైల్‌ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల రూ.67,690 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, ఇందులో రూ.14వేల కోట్లు కార్యరూపం దాల్చాయని వివరించింది. భారత ఆర్థిక వ్యవస్థ కోవిడ్‌ అనంతరం పుంజుకునేందుకు విధాన రూపకర్తలు చేసిన ప్రయత్నం ఆర్థిక స్థిరత్వాన్ని నిర్థారిస్తుందని ఈ సర్వే పేర్కొంది. ప్రపంచ అస్థిరతల నడుమ ‘అధిక వృద్ధి ఆకాంక్షలు కలిగిన దేశానికి ‘మార్పు’ మాత్రమే స్థిరంగా ఉంటుందని’ ఈ సర్వే చెప్పింది. వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణం వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై ఒప్పందాలు చేసుకోవడం కష్టంగా మారింది. 2022 నుంచి ప్రయివేటు రంగం పెట్టుబడులు పెడుతున్నప్పటి నుంచి కొన్నేళ్లుగా ప్రభుత్వ పెట్టుబడులు మూలధనాన్ని కొనసాగించాయని ఈ సర్వే స్పష్టం చేసింది. కొన్ని నిర్దిష్ట ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటు పెరిగినప్పటికీ, ప్రధాన ద్రవ్యోల్బణం రేటు చాలావరకు నియంత్రణలో ఉంది. 2023 కంటే 2024లో వాణిజ్యలోటు తక్కువగా ఉంది. జీడీపీలో కరెంట్‌ ఖాతా లోటు దాదాపు 0.7 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా మిగులును నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img