Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అంతా అయోమయం!

. ఏడో జాబితాపై అధిష్ఠానం కసరత్తు
. మరో ఆరు ఎంపీ స్థానాలపై దృష్టి
. సిద్ధం సభకు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల డుమ్మా

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : వైసీపీ చేపట్టిన ఇన్‌చార్జిల మార్పులు, చేర్పులతో లాభమా? నష్టమా? అనేదీ తెలియక ఆ పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. అధినేత ఆదేశాల మేరకు ఎక్కడికి పంపితే అక్కడికి ఇన్‌ చార్జిలు వెళ్లి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలకు ఇప్పటివరకు 17 ఎంపీ స్థానాలకు మార్పులు, చేర్పులు చేశారు. మరిన్ని జాబితాలు వస్తాయన్న సమాచారంపై వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే జాబితాలో మరో ఆరు ఎంపీ స్థానాలకు ఇన్‌చార్జిలను మార్చే అవకాశముంది. సర్వేల రీత్యా కడప ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి స్థానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని సమాచారం. అదే సమయంలో కొన్ని ఎమ్మెల్యే స్థానాలను మార్చు తారన్న ప్రచారముంది. ఇప్పటివరకు విడుదల చేసిన ఐదు జాబితాల్లో కొంతమందిని జడ్పీటీసీ, డిప్యూటీ మేయర్‌గా ఉన్న వారిని ఎంపిక చేశారు. మరికొందరు సామాన్యులను ఇన్‌చార్జిలుగా ప్రకటించారు. మంత్రులు ఉషశ్రీ చరణ్‌, మేరుగు నాగార్జున, తానేటి వనితలకు స్థానచలనం కలిగింది. మంత్రి జయరామ్‌కు అసలు సీటే లేదు. ఆయనను కర్నూలు ఎంపీ ఇన్‌చార్జిగా ప్రకటిం చడంపై అసంతృప్తికి గురయ్యారు. తిరిగి తనను ఎమ్మెల్యేగా కొనసాగించాలని కోరినప్పటికీ, అందుకు ఆధిష్టానం నిరాకరించింది. మంత్రి జయరామ్‌ దాదాపు పది రోజులపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశానికి హాజరవ్వగా, ఆయనపై వైసీపీ ముఖ్యనేతలు సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఇప్పటికే జయరాజ్‌ స్థానంలో కర్నూలు మేయర్‌ను రంగంలోకి దించారు. ఒంగోలు ఎంపీగాను, జిల్లాకు అదనపు సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ప్రతిపాదించడంపై ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు ఎంపీగా మాగుంటను తిరిగి నిలిపేందుకు ఆయన ఆధిష్ఠానం దగ్గర చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఒంగోలులో పరిణామాలు ఏదిశకు చేరతాయనేదీ ఆసక్తికరంగా మారింది.
‘సిద్ధం’ సభతో ప్రయాణికుల ఇక్కట్లు
ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన వైసీపీ సిద్ధం సభకు ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దెందులూరు నియోజకవర్గ కేంద్రంగా 110 ఎకరాల ప్రాంగణంలో సభను నిర్వహించారు. దీనికి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు తరలివెళ్లారు. ఇందు కోసం వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల అధ్వర్యంలో ప్రత్యేకంగా ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు, వాహనాలను ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత, సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతప్రసాద్‌, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సిద్ధం సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారంతా టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం. ఇప్పటికే వైసీపీ తలపెట్టిన నియోజకవర్గ ఇన్‌చార్జిల మార్పులు, చేర్పుల్లో భాగంగా ఆ ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఆధిష్టానం నిరాకరించింది. వారి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా ఇన్‌చార్జిలను నియమించారు. వైసీపీ ఆరు జాబితాల ద్వారా 65 మంది ఎమ్మెల్యే, 17 మంది ఎంపీ ఇన్‌చార్జిలను మార్పులు, చేర్పులు చేసింది. ఈ జాబితాల్లో ఊహించని విధంగా కొత్త వారికి చోట్లు దక్కాయి. సిట్టింగ్‌ల స్థానాలు గల్లంతయ్యాయి. సిట్టింగ్‌ ఎంపీలకు సైతం టికెట్లు ఇవ్వలేదు. ఈ పరిణామాలు వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్చిన నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. వారిని సమన్వయం చేసేందుకు వైసీపీ ముఖ్యనేతలు తలలుపట్టుకుంటున్నారు. పైకి ఆ నేతలు సహకరిస్తామని, క్షేత్రస్థాయిలో వారి వర్గం నేతలను నిలుపుదల చేస్తున్నారు. దీంతో కొత్తగా వచ్చిన ఇన్‌చార్జిల కార్యకలాపాలకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. సిద్ధం సభ కారణంగా నాలుగో నంబరు జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించారు. ఈ మూడు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోజు వారీ ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ఆటోలు, ఇతర వాహనాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరువయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img