Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఉప్పు రైతు ఉక్కిరిబిక్కిరి!

. భారీగా పతనమైన ధరలు
. ఎగుమతులు లేక దిబ్బలుగా దర్శనం
. విలవిల్లాడుతున్న వ్యాపారులు
. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వైనం

విశాలాంధ్ర బ్యూరో – ఏలూరు : ఉప్పు లేనిదే రుచి లేదు. ఏ వంటకంలోనైనా ఉప్పు ఉండాల్సిందే. అలాంటి ఉప్పు రైతులు నేడు సంక్షోభంలో కూరుకుపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉప్పు రైతులు గిట్టుబాటు ధరలు లేక విలవిల్లాడిపోతున్నారు. దిగుమతులు భారీగా పెరగడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం మే, జూన్‌లో ఉప్పు ఉత్పత్తి అధిక వర్షలకారణంగా తగ్గిపోవ డంతో ధరలు భారీగా పెరిగాయి. దీంతో రైతులు ఆర్థికంగా బలపడ్డారు. ఈ సంవతర్సం వర్షభావ పరిస్థితులు నెలకొనటంతో గత అక్టోబరులో ఉప్పు ఉత్పత్తి పెరగడంతో ధరలు అమాంతం పడిపోవడంతో ఇటు వ్యాపారులు, రైతులు ఆర్థికంగా పతనావస్థకు చేరారు. గతంలో ఇదే రోజుల్లో 17.5 టన్నుల ఉప్పు లారీ రూ. 70 వేలకు పైగా ఉండగా ఈ ఏడాది కేవలం రూ.33 వేల నుంచి 35 వేలు మాత్రమే పలుకుతుం డడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. జిల్లా వ్యాప్తంగా రాబోయే రోజుల్లో వర్షభావ పరిస్థితులు నెలకొంటే ఉప్పు కొనుగోలు చేసే నాథుడే ఉండరని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా పెదమైనవాని లంక, వేముల దీవి, తూర్పు తాళ్ళు, కేపీ పాలెం తదితర ప్రాం తాల్లో వేలాది ఎకరాల్లో ఉప్పు ఉత్పత్తి అవుతుంది. ప్రధానంగా జనవరి చివరి వారం నుంచి ప్రారంభమై జూన్‌, జులైలో ఆగిపోతుంది. రైతులు, వ్యాపారులు ఎప్రిల్‌, మే, జూన్‌, జులైలో ఉత్పత్తిని నిల్వచేసి అక్టోబరు, నంబరు, డిసెంబరు లో విక్రయించడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఒక్కో లారీ రూ.32 వేల నుంచి 40వేల వరకు పలుకుతుంది. అధిక ధర లభిస్తే ఉప్పు రైతులు నవంబరు, డిసెంబరు నెలల్లో విక్రయించి ఆర్థికంగా బలపడతారు. కానీ, ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉప్పు దిగుబడులు రావడం, నిల్వచేసిన ఉప్పు ఎగుమతులు కాక దిబ్బలు దిబ్బలుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం కారణంగా ఒక్కో వ్యాపారుడికి, రైతుకు లారీకి రూ.5 వేల వరకు నష్టం వాటిల్లే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉప్పు ఎక్కువగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాలకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎగుమతులు అవుతుండడంతో ధరలు పతనావస్థకు చేరాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అధిక దిగుబడులు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని నట్టేట ముంచాయని చెప్పవచ్చు.
50 శాతం తగ్గిన ఉత్పత్తి…
రాష్ట్రానికి ఏడాదికి ఆరున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పు ఉత్పత్తి అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అందులో 50 శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఉప్పు పండిరచే సీజనులో వర్షాలు పడటంతో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఉప్పు ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నేడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకు పోయింది. ఉప్పు భూముల్లో రొయ్యల సాగు చేయడమే దీనికి ప్రధాన కారణం అని రైతులు చెబుతున్నారు. గతంలో వేముల దీవి, కేపీ పాలెం, తూర్పు తాళ్ళు, పెదమైని వాని లంక ప్రాంతాల్లో సుమారు ఏడు వేల ఎకరాల్లో ఉప్పు సాగు అయ్యేది.కానీ నేడు కేవలం పెదమైనవానిలంక ప్రాంతంలో మాత్రమే సాగు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఉప్పు సాగయ్యే భూములను రొయ్యల చెరువులుగా మార్చడం వలన ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఉప్పు తయారు చేసినా నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు.
ఎన్నికల వాగ్ధ్దానం విస్మరించిన సీఎం జగన్‌
2019 ఎన్నికలను పురస్కరించుకుని నరసాపురం పర్యటనలో.. తాను అధికారం చేపడితే ఉప్పు రైతులను ఆదుకుంటానని జగన్‌ హామీ ఇచ్చారు. అనుకూల పరిస్థితుల్లో ఉప్పు తయారుచేసి గిట్టుబాటు ధర వచ్చే వరకు తీర ప్రాంతంలో తాను కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తానని, బోర్లు వేయిస్తానని వాగ్ధానం చేసి అధికారం చేపట్టిన తర్వాత తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. గత సంవత్సరం మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన ఉప్పు రైతులకు రూ.2,500 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు.
మద్దతు ధర లేదు….
ప్రస్తుతం ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతుంది.. ప్రస్తుతం రేటు టన్ను రూ.2,500 కూడా పలకటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కూడా రావడం లేదని పెదమైనివాని లంక గ్రామ రైతులు పొన్నమండ వీరాస్వామి, మైలా భాస్కరరావు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టన్ను రూ.5 వేల వరకు ఉండేదని నేడు సగానికి సగం ధర తగ్గిపోయిందని వాపోయారు.
ప్రభుత్వం ఆదుకోవాలి…
అనుకూల పరిస్థితులలో తయారైన ఉప్పును సరైన ధర పలికే వరకు నిల్వ చేసుకునే సామర్థ్యం గల కోల్డ్‌ స్టోరేజ్‌లను ఏర్పాటు చేస్తే ఉప్పు రైతులు లాభం పొందే అవకాశం ఉంటుంది. ఎన్నికల వాగ్ధానం మేరకు కోల్డ్‌ స్టోరేజ్‌ని నిర్మించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాంకు రుణ సౌకర్యం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. తమకు ఇతర రైతుల మాదిరి గుర్తించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img