Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఎన్నికల రగడ

ఎన్డీఏ, వైసీపీ బాహాబాహీ

. వాహనాల ధ్వంసం.. బల ప్రదర్శనలు…రాళ్లదాడులు
. ఏలూరు, అనకాపల్లిలో ఎంపీ అభ్యర్థుల కార్లు ధ్వంసం
. పోలింగ్‌కు ముందే రాష్ట్రంలో ఉద్రిక్తత

విశాలాంధ్రబ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఘట్టం దాదాపు చివరి దశకు చేరింది. ఎన్నికలకు ముందే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి, వైసీపీ మధ్య మాటల దాడితో ప్రచారం వేడెక్కింది. అంతటితో ఆగకుండా అక్కడక్కడ పార్టీల నేతలు దౌర్జన్యాలు, హింసాత్మక సంఘటనలకు దిగుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నేతలపై రాళ్లతో దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అధికార వైసీపీ సైతం దూకుడుగా ముందుకు వెళ్తున్నది. రాజకీయ నేతలపై దాడులు, అభ్యర్థులను అడ్డుకోవడం…పోటాపోటీ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎన్డీఏ పార్టీలు, వైసీపీ నేతల ప్రసంగాలు ఉద్రిక్తంగాను, రెచ్చగొట్టే విధంగా ఉండటంతోనే ఈ దుస్థితి ఏర్పడిరదన్న వాదనలున్నాయి. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ డాబాకొట్ల సెంటర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పై రాయితో దాడి జరగడం సంచలనం రేపింది. ఈ ఘటనలో సీఎం జగన్‌ నుదిటిపైన ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ కంటికి గాయమైన సంగతి విదితమే. దాడికి పాల్పడిన వారిని పోలీసులు విచారించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్‌ సభల్లోను రాళ్లు విసిరినట్లుగా ఆ పార్టీ నేతలు వెల్లడిరచారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ కారును వైసీపీ ఎంపీ అభ్యర్థి మూడి ముత్యాల నాయుడు అనుచరులు ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతకుముందు బూడి ముత్యాల నాయుడు ఇంటి పరిసర ప్రాంతాలను బీజేపీ నాయకులు డ్రోన్లతో చిత్రీకరించడంతో ఈ సంఘటనకు కారణమైందని భావిస్తున్నారు. ఇదే అనకాపల్లి నియోజకవర్గంలో ఓ జ్యూయలరీ షాపులో తనిఖీలకు వెళ్లిన ఐటీ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంగోలులో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులురెడ్డికి మద్దతుగా ఆమె కోడలు, మాజీ వలంటీర్‌ ప్రచారానికి వెళ్లగా, టీడీపీ నేతలు అడ్డుకుని దుర్భాషలాడిన సంఘటనలున్నాయి.
ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్‌ కారుపై దాడి
ఏలూరు జిల్లా రంగాపురం దగ్గర వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ కుమార్‌ కారుపై ఎన్డీఏ కూటమికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడి, ధ్వంసం చేశారు. ఆయన కారు అద్దాల్ని పగలగొట్టారు. రంగాపురం దగ్గర టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రచారం చేస్తున్న సమయంలో…ఆ మార్గం ద్వారా వేరొక ప్రాంతానికి ప్రచారానికి వెళ్తున్న సునీల్‌కుమార్‌ కారును అడ్డగించి దాడికి పాల్పడ్డారు. ఇదే జిల్లాలోని దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ దళిత కాలనీ యువకులను దూషించిన సంఘటనపైనా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగాగీత ప్రచారం చేస్తుండగా టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎదురెళ్లి రెచ్చగొట్టేలా నినదించడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడిరది. పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img