Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కస్టడీకి కేజ్రీవాల్‌

28వ తేదీ మధ్యాహ్నం అప్పగించాలన్న కోర్టు

. ప్రధాన సూత్రధారి… విచారణకు సహకరించలేదన్న ఈడీ
. పది రోజుల కస్టడి కోరిన దర్యాప్తు సంస్థ
. వారం రోజులకు అనుమతిచ్చిన కోర్టు
. ఆధారాలుంటే కోడ్‌ వచ్చే వరకు ఎందుకు అరెస్టు చేయలేదని వ్యాఖ్య
. దిల్లీ సీఎం తరపు న్యాయవాదుల ప్రశ్న
. దేశవ్యాప్తంగా ఆందోళనలు
. 26న ప్రధాని నివాసం ముట్టడిస్తాం: ఆప్‌

న్యూదిల్లీ : మద్యం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈనెల 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్‌ను కీలక నిందితుడిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ) ఆరోపించింది. పది రోజుల కస్టడీని కోరింది. కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈనెల 28 వరకు కేజ్రీవాల్‌ కస్టడీకి ఆదేశాలిచ్చారు. ఆరోజు మధ్యాహ్నం మరలా కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.
తొలుత వాదనలు వినిపించిన ఈడీ… మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను ‘కింగ్‌పిన్‌’ అని ఆరోపించింది. దిల్లీ మద్యం విధానం 2021`22 రూపొందించడానికి ‘సౌత్‌ గ్రూపు’ నుంచి రూ.100 కోట్లు డిమాండ్‌ చేసినట్లు ఈడీ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు వాదించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగమైన రూ.45 కోట్లు హవాలా మార్గంలో వచ్చినట్లు తెలిపారు. నిందితులు, సాక్షుల వాంగ్మూలాలను కాల్‌ డీటెయిల్‌ రికార్డ్స్‌ (సీడీఆర్‌) ద్వారా ధృవీకరించినట్లు వెల్లడిరచారు. మధ్యహ్నం 2 గంటల సమయంలో భారీ భద్రత నడుమ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల రిమాండ్‌ను ఈడీ తరపున రాజు కోరారు. ఆప్‌ ఒక కంపెనీ అని, దీంతో ముడిపడ్డ ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సిందేనన్నారు. కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాదులు విక్రమ్‌ చౌధురి, అభిషేక్‌ మను సింఫ్వీు వాదించారు. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలన్నీ ఉంటే లోక్‌సభ ఎన్నికలు వచ్చేంత వరకు అరెస్టు చేయకుండా ఎందుకు ఆగారని కోర్టులో ఈడీని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాదులు నిలదీశారు. ‘సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. కోడ్‌ అమల్లో వచ్చేంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదు? నిరీక్షణకు కారణమేమిటి? ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి రాజకీయ నాయకుడి హక్కు, ఈడీ తన ముసుగు తొలగించి వారిది ఎవరి పక్షమో తేల్చిచెప్పాలి’ అని చౌధుని వాదించారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని దిల్లీ హైకోర్టు చెప్పిన కొన్ని గంటలలోనే ఈడీ ఆయనను అదుపులోకి తీసుకుంది. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం దానిని ఉపసంహరించుకున్నారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ‘ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన తన అధికారాన్ని దుర్వినియోగించారు. విధాన రూపకల్పనలో ఆయన కీలక పాత్రధారి. నేరంలో సూత్రధారి, గోవా ఎన్నికల ప్రచారంలోనూ ఆయనది ప్రధాన పాత్ర. పార్టీకి ఆయన అధినేత. ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేశారు. విచారణకు సహకరించలేదు. తనిఖీలప్పుడు వాస్తవాలు వెల్లడిరచలేదు. ఆయనను విచారించి, సమాచారాన్ని సేకరించేందుకు రిమాండ్‌ కోరుతున్నాం. గోవా ఎన్నికల నిధిని మార్చేందుకు మద్యం విధానాన్ని సవరించారని ఆధారాలు ఉన్నాయి’ అని రాజు వాదించారు. ఈడీ రిమాండ్‌ కోరడంపై కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది సింఫ్వీు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదంతా ఒక్క పద్ధతి ప్రకారం జరిగింది. అందువల్ల సాక్షుల వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొని ఆయనను అరెస్టు చేశారు. కానీ ఇప్పుడు కొత్త పద్ధతి కనిపిస్తోంది. మీ వద్ద ఉన్న సాక్షి తన వాంగ్మూలం ఒకటి లేక రెండులో కేజ్రీవాల్‌ పేరు ప్రస్తావించలేదు. మీరు అతనిని అరెస్టు చేసి బెయిల్‌నూ నిరాకరిస్తారు. అప్పుడు అతను అప్రూవర్‌గా మారుతాడు. ఆ తర్వాత అనుకోకుండా ఒక రోజు అద్భుత వాంగ్మూలం ఇస్తాడు’ అని సింఫ్వీు అన్నారు. కేజ్రీవాల్‌ నేరం చేసినట్లు ప్రత్యక్ష ఆధారాలేమీ లేవని వాదించారు. అరెస్టు గురైన వారికి క్షమాభిక్ష పెడితే వారు ఎవరో ఒకరి పేరును కచ్చితంగా చెబుతారని సింఫ్వీు నొక్కి చెప్పారు. సిట్టింగ్‌ ముఖ్యమంత్రి అరెస్టు కావడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇప్పటికే ఈయన పార్టీకి చెందిన నలుగురు సీనియర్లు అరెస్టు అయ్యారు. అంటే ఒక్క ఓటు కూడా నమోదు కాకుండానే ఫలితాలు వెల్లడయ్యాయి. రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం ప్రధానం. ఈ పద్ధతి సరైనది కాదు’ అని సింఫ్వీు వాదించారు.
బీజేపీ పెద్ద తప్పు చేసింది: ఆప్‌
కేజ్రీవాల్‌ అరెస్టుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని దుయ్యబట్టాయి. ప్రతిపక్షాలను బలహీనపర్చేందుకు, వారిని భయపెట్టేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు. నేరుగా ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేక దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలను అణచివేయాలని మోదీ యత్నిస్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వ్యాఖ్యానించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నదని, తమ నాయకుడిని అరెస్టు చేసి బీజేపీ పెద్ద తప్పు చేసిందని ఆప్‌ పేర్కొంది. కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఈనెల 26న ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తామని ప్రకటించింది. కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆప్‌ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. ‘నిరంకుశత్వం కొనసాగబోదు… అరవింద్‌ నువ్వు పోరాడు… మేము నీ వెంట ఉన్నాం’ అన్న నినాదాలను ఆప్‌ కార్యకర్తలు చేశారు. అయితే నిరసనకారులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు పోలీసులు యత్నించారు. లాఠీలు రaుళిపించారు, జల ఫిరంగులు ప్రయోగించారు. అనేక మంది నాయకులు, కార్యకర్తలు అరెస్టు చేశారు. నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. పోలీసులు దౌర్జన్యాన్ని విపక్షాలు ఖండిరచాయి.
కవిత బెయిల్‌కు సుప్రీం తిరస్కృతి
బీఆర్‌ఎస్‌ నాయకురాలు కె.కవితకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మద్యం కేసులో ఆమెకు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ప్రోటోకాల్‌ను అతిక్రమించలేమని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సందేశ్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. రాజ్యాంగ అంశాలపై ఈడీకి నోటీసులిచ్చింది. ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్‌ దాఖలుకు అవకాశం కల్పించింది. ఈడీ తీరు, తాజా పరిణామాలు నిరాశకు గురిచేస్తున్నాయని కవిత తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా ఆమెను పిలిచారని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యమేమీ లేదని, అప్రూవర్‌ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు సాగుతోందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని తెలిపింది. బెయిల్‌ ఇవ్వలేమని, కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కేసు విచారణ వేగంగా జరిపించాలని కింది కోర్టును ఆదేశించింది. ఈ పిటిషన్‌లో రాజ్యాంగ ఉల్లంఘన అంశాలను లేవనెత్తినందున దీన్ని విజయ్‌ మదన్‌ లాల్‌ కేసుకు జతచేస్తున్నట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img