Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

చేరికలపై జగన్‌ దృష్టి

. ఎనిమిదో జాబితాపై కసరత్తు
. సీఎంఓకు వైసీపీ నేతలు
. కొందరు ఇన్‌ఛార్జిలకు స్థానచలనం!

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: వైసీపీ ఇన్‌ఛార్జిల మార్పులు, చేర్పులపై అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు అందుకున్న ఎమ్మెల్యేలు, నేతలు గురువారం విచ్చేసి వైసీపీ ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపారు. అనంతరం సీఎం జగన్‌ను కలిశారు. ఇప్పటికే వైసీపీ ఏడు జాబితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన నియోజకవర్గాల్లో మార్పులపైనా జగన్‌ దృష్టి పెట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో తెరపైకి వచ్చిన కొత్త, పాత వారి పేర్లను పరిశీలిస్తున్నారు. నియోజకవర్గాల నేతల్లో పనితీరు బాగాలేకుంటే, వారినీ మార్చేందుకు సిద్ధమయ్యారు. దీంతోపాటు పార్టీలోకి కొత్తగా వచ్చే వారినీ ఆహ్వానిస్తున్నారు. వారిలో కొందరికి టికెట్ల హామీతోను, మరికొందరు షరతులు లేకుండా పార్టీలోకి చేరనున్నారు.
ఇటీవల టీడీపీ నూజివీడు ఇన్‌చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు సీఎంను కలిశారు. ఆయనకు టికెట్‌ హామీ లభించినట్లు సమాచారం. ఏ నియోజకవర్గం అనేదీ స్పష్టత రావాల్సి ఉంది. తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల పరిశీలకుడు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కార్యాలయానికి జలీల్‌ఖాన్‌ వెళ్లి ఆయనను కలిశారు. విజయవాడ పశ్చిమకు తన కుమార్తెకు టికెట్‌ అడుగుతున్నట్లు ప్రచారం. సీఎంవోకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వెళ్లారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ సమస్యపైనా ముఖ్యనేతలు దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరామ్‌ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీంతో ముందస్తుగానే వైసీపీ ముఖ్యనేతలు రామసుబ్బారెడ్డి తదితరులు సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి జయరామ్‌ అనుచరులు డుమ్మా కొట్టారు. వైసీపీలోకి తిరిగి వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)కు గుంటూరు ఎంపీ లేదా, సత్తుపల్లి ఎమ్మెల్యేపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. గుంటూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జిగా ఉమ్మారెడ్డి వెంకట రమణను, మచిలీపట్నం పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా సింహాద్రి రమేశ్‌ను ఇటీవల నియమించారు. వీరిద్దరు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో వారి స్థానాల్లో గుంటూరుకు ఆళ్ల రామకృష్ణారెడ్డిని, మచిలీపట్నానికి మంత్రి అంబటి రాంబాబును బరిలో దించాలని వైసీపీ కసరత్తు చేస్తోంది. టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వైసీపీలో చేరితే, ఆయన పేరును మచిలీపట్నానికి ప్రతిపాదిస్తున్నారు. సినీనటుడు అలీని నంద్యాల ఎంపీ లేదా నెల్లూరు ఎంపీగా బరిలో దించే వ్యూహంలో వైసీపీ ఉంది. వాటన్నిటిపై కసరత్తు చేసి, ఎనిమిదో జాబితా విడుదలకు వైసీపీ సిద్ధమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img