Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జగన్‌ నిర్వాకంతోబడ్జెట్‌ పెట్టలేని దుస్థితి

అసమర్థ పాలనతో అన్ని వ్యవస్థలు ధ్వంసం
రాష్ట్రాన్ని గాడినపెట్టి… ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం
గవర్నర్‌కు ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం నాలుగు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, మరో మూడు అంశాలపై అసెంబ్లీలో విడుదల చేస్తామని తెలిపారు. వీటన్నింటిపై సమగ్రంగా చర్చించిన తర్వాతే రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగానికి చంద్రబాబు ధన్యవాద తీర్మానం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లూ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయినా రాజధాని లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతి అంటే గతంలో మద్రాస్‌ అనేవారని, తెలుగు జాతి గౌరవాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రపంచవ్యాప్తంగా పెంచారని కొనియాడారు. తెలుగు వారంటే ఆంధ్ర ప్రదేశ్‌ అనేలా ఎన్టీఆర్‌ చేశారని గుర్తుచేశారు. అదే జగన్‌ ఏపీ అంటే పెట్టుబడిదారులు భయపడేలా అరాచకపాలన సాగించారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారన్నారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన అమరావతిని సర్వ నాశనం చేశారు. రాజధాని కలను చంపేశారు. అమరావతి దేవతల రాజధాని. అటువంటి దానిని నిన్నటి వరకు ఎలా నాశనం చేశారో మనం చూశాం. కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చి బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించింది. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే దాదాపు రెండు, మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద వచ్చి ఉండేది. ఈ రోజు అప్పులు చేయాల్సిన అవస్థ తీరేది. టీడీపీ హయాంలో ఏపీ జీవనాడి పోలవరం 72 శాతం పూర్తయింది. 2020-21 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారు. కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను మార్చడం, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం చేశారు. వచ్చిన పరిశ్రమలను కూడా వెళ్లగొట్టారు. యువతకు ఉపాధి లేకుండా చేశారు. మరోపక్క ఇసుక, మద్యం వంటి వాటిలో రూ.లక్షల కోట్ల మేర దోపిడీ జరిగాయి. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 2019 నుంచి రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయింది. మూలధనాన్ని 60 శాతం మేర తగ్గించారు. జలవనరులపై 56 శాతం, రోడ్లపై 85 శాతం మూలధనం తగ్గింది. రాష్ట్ర చరిత్రలో గత ఐదేళ్లు చీకటి రోజులుగా మిగిలిపోయాయి. రాష్ట్రంలో దాదాపు లక్షా 75 వేల ఎకరాల భూములు కబ్జా చేశారు. మెడపై కత్తిపెట్టి తమ పేరుపై భూములు రాయించుకున్నారు. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు ఎన్నో చూశాం. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించిన వారిని అనేకమందిని పొట్టన బెట్టుకున్నారు. కేసులు బనాయించి వేధించారు. అబద్దాలతో విషప్రచారాలకు పాల్పడ్డారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడారు. వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. దేశంలో ఎక్కడాలేని విధంగా విచారణాధికారిపై కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తీసుకునే పరిస్థితి. నేరస్తుడే సీఎం అయితే పోలీసులు కూడా వంత పాడే పరిస్థితి నెలకొంది. వివేకా హత్య కేసు నిందితుల అరెస్టుకు వెళ్లిన సీబీఐ సిబ్బందే వెనక్కి తిరిగి రావడం కూడా దేశంలో ఎక్కడా జరగలేదు.
చివరకు సొంత బాబాయిని ఎవరు చంపారో ఇంతవరకు తేలలేదు. హు కిల్డ్‌ బాబాయ్‌ అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుంది. ఇటువంటి అనేక ఘోరాలకు పాల్పడినవారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ దిల్లీలో ధర్నా చేయడాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు… రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రజలిచ్చిన తీర్పు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు సమష్టిగా ముందుకెళతాం. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img